ఫిల్మ్ డెస్క్- టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల హవా పెరుగుతోంది. దర్శకులతో పాటు, హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇదిగో ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ హీరోలుగా, దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. సుమారు రెండేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, ఎట్టకేలకు ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. ఈ ప్యాన్ ఇండియా సినిమా పలు బాషల్లో విడుదలవుతున్న నేపథ్యంలో అన్ని భాషాల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. ముంబై, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు లాంటి నగరాల్లో ప్రెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో సంలనం రేపుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల తరువాత మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు వచ్చే అవకాశాలున్నాయా ప్రశ్నకు ఎన్టీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చొ లేదో తెలియదు కానీ.. మా రెండు కుటుంబాల మధ్య 35 సంవత్సరాలుగా పోరు నడుస్తోందని అన్నారు ఎన్టీఆర్. అయినా తామిద్దరం (రామ్ చరణ్, ఎన్టీఆర్) మంచి స్నేహితులమని చెప్పారు. తమ మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంటుందని చెప్పిన ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ తర్వాత దేశంలోని గొప్ప నటీనటులంతా ఒకే తాటి పైకి వస్తారని, భారీ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.
అన్నట్లు ఆర్ఆర్ఆర్ సినిమాలో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, మన్యం వీరుడుగా రామ్ చరణ్ నటించారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ కూడా కీలక పాత్రలు పోషించారు. సముద్ర ఖని, శ్రియా శరన్ తో పాటు, హాలీవుడ్ నుంచి ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి వంచి వారు సైతం ఈ సినిమాలో నచించారు.