ఫిల్మ్ డెస్క్- సెలబ్రెటీలకు కార్లంటే భలె ఇష్టం. కొంత మందికి ఐతే కార్లపై పిచ్చి అని చెప్పవచ్చు. మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు ఎప్పుడెప్పుడు కొనేద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఇక సినిమా హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు చాలా మంది హీరోలకు కార్లపై మెజు ఉంది. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి.
ఎన్టీఆర్ కు కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర ఇప్పటికే చాలా కార్లున్నాయి. ఆడి, బీఎండబ్లూ, ల్యాండ్ రోవర్, వాల్వో.. ఇలా చాలా కార్ల కలెక్షనే ఉంది ఎన్టీఆర్ గ్యారేజ్ లో. ఇదిగో మళ్లీ ఇప్పుడు మరో కొత్త కారును కొన్నారట ఎన్టీఆర్. అది కూడా చాలా ఖరీదైన కారని చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అతి ఖరీదైన లంబోర్ఘిని కారును బుక్ చేసినట్లు గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ కారు ఇండియాకు చేరుకుందని తెలుస్తోంది. ఎక్స్‌ట్రార్డినరీ ఫీచర్స్‌తో లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ మోడల్ కారు హైదరాబాద్ వచ్చేసిందట. ఈ మోడల్ కారు ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ దగ్గరే ఉంది.
ఈ కారు ఖరీదు సుమారు 8 కోట్ల రూపాయలని చెబుతున్నారు. బెంగుళూరుకి చెందిన ఆటో మొబైలియార్డెంట్ లంబోర్ఘి ఈ కారు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి ఈ కారులో ఎన్టీఆర్ ఎక్కి తిరిగే ఫోటోలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ కారు ఫోటో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.