నిజామాబాద్- సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నా నేరస్తుల్లో మార్పు రావడం లేదు. మహిళలు, అమ్మాయిలపైనే కాదు ఆఖరికి చిన్నారులపై కూడా దారుణాలు జరుగుతున్నాయి. దీంతో పిల్లలను స్కూల్ కు పంపాలన్నా కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు.
కామంతో కళ్లుమూసుకుపోతున్న దుర్మార్గులు ఆఖరికి బడికి వెళ్లే పిల్లలను సైతం వదలడం లేదు. మహిళలు, బాలికలపై దారుణాలతో అంతా ఆందోళన చెందుతుంటే, ఇప్పుడు బాలుడిని కూడా వదలని అత్యంత నీచమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుకుంటున్న బాలుడిపై అదే స్కూల్ కు చెందిన టీచర్ లైంగిక దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది.
ఈ దారుణమైన ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. నగర శివారు ప్రాంతంలోని ఓ ప్రైవేటు స్కీల్ లో చదువుతున్న బాలుడిపై అదే స్కూల్ లో ఫిజికల్ ట్రైనింగ్ టీతర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటికి వచ్చుంది. పాఠశాల యాజమాన్యాన్ని తల్లిదండ్రులు నిలదీసినట్లు సమాచారం.
ఐతే ఈ విషయం బయటకు రాకుండా తల్లిదండ్రులను స్కూల్ మేనేజ్ మెంట్ మభ్యపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ విషయం తమ దృష్టికి రావడంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు పాఠశాలకు వచ్చి విచారణ జరపారని తెలుస్తోంది. విచారణాధికారులు ఉన్నతాధికారులకు త్వరలోనే నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. ఐతే పాఠశాలలో అలాంటి ఘటన ఏదీ జరగలేదని స్కూల్ యజమాన్యం చెబుతోంది.