మామూలుగా ఎవరినైనా పలానా సినిమా ఎలా ఉందో అడిగితే పర్లేదు, బాగుంది అని అంటారు. కానీ నిఖిల్ సినిమా ఎలా ఉంది అని అడిగితే మాత్రం అద్భుతంగా ఉందని అంటారు. పర్లేదు, బాగుంది అనే స్టేజ్ నుంచి అద్భుతంగా ఉంది అనిపించుకునే స్టేజ్ కి వచ్చారంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడున్న నిఖిల్ సిద్ధార్థకి, ఇప్పుడున్న నిఖిల్ సిద్ధార్థకి చాలా వ్యత్యాసం ఉంది. రొటీన్ సినిమాలు ఎంచుకుంటూ.. ఒక మూస మార్గంలో వెళ్తున్న నిఖిల్.. ఉన్నట్టుండి రూట్ మార్చారు. కళవర్ కింగ్, వీడు తేడా, డిస్కో సినిమాల్లో మనం చూసిన నిఖిల్ కాదు ఇప్పుడున్నది. సినిమా అంటే హీరోయిజం కాదు, హీరోయిజం అంటే కంటెంట్ మాత్రమే అని తెలుసుకుని అసలైన హీరోకి నిర్వచనం చెప్పారు నిఖిల్.
నిజంగా స్వామిరారా సినిమా నుంచి నిఖిల్ ఆలోచనా తీరు మారిపోయింది. స్టోరీ సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చిన్న బడ్జెట్ లో ఎంత పెద్ద సినిమాలు తీయవచ్చునో అనేది నిఖిల్ సిద్ధార్థ చేసి చూపిస్తున్నారు. కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం, రీసెంట్ గా రిలీజ్ అయిన కార్తికేయ 2 ఇవన్నీ కమర్షియల్ గా ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో మనకి తెలిసిందే. ముఖ్యంగా కార్తికేయ 2 నిఖిల్ కెరీర్ లోనే భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. శ్రీకృష్ణ తత్వం, ద్వారకా నగరం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఇటు తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్ లో సైతం సంచలనం సృష్టించింది.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు నిఖిల్, చందూ మొండేటిలపై ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో కార్తికేయ టీమ్ పై మరింత బాధ్యత పెరిగింది. దీంతో కార్తికేయ 3ని కార్తికేయ 2 కంటే అద్భుతంగా తీయాలని ఫిక్స్ అయ్యారు. కార్తికేయ 2 మూవీ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందని ఇప్పటికే చందూ మొండేటి, నిఖిల్ హింట్ ఇచ్చారు. అయితే తాజాగా కార్తికేయ 3 పై నిఖిల్ ఒక అప్ డేట్ ఇచ్చారు. ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “కార్తికేయ సినిమా మొదటి రెండు భాగాలూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. అందరి ఆశీస్సులతో త్వరలో కార్తికేయ 3 మొదలుపెట్టనున్నాము. ఈ సినిమా ఎప్పుడు పూర్తిచేస్తామా? ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తామా? అని ఆతురతగా ఉన్నాము. ఎందుకంటే దీన్ని 3డిలో రూపొందిస్తున్నారు” అంటూ నిఖిల్ వెల్లడించారు.
National Cinema Day.. Advanced HOUSEFULLS #Karthikeya2 all over the country in its 7th week🙏🏽🙏🏽🙏🏽
Do catch the movie for least prices in all Theatres 🔥🔥🔥 #Karthikeya2Hindi #Karthikeya2Malayalam pic.twitter.com/NI2Mh7KNBc— Nikhil Siddhartha (@actor_Nikhil) September 22, 2022
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 23న నేషనల్ సినిమా డే సందర్భంగా టికెట్ల ధరను రూ. 75 చేసిన సంగతి తెలిసిందే. ఆ ఒక్క రోజే ఇంత తక్కువ ధరకు సినిమా చూసే అవకాశం ఉంది. కాగా కార్తికేయ 2 సినిమా రిలీజ్ అయిన 7వ వారంలో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. “అడ్వాన్స్ హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి, థియేటర్స్ లో తక్కువ ధరకి సినిమా చూసేయండి” నిఖిల్ ట్వీట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.