మెగా ఫ్యామిలోలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో తళుక్కుమన్నారు. ఒక్క పవన్ కల్యాణ్ పిల్లలు మాత్రం ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. ఇక మెగా ఫ్యామిలిలో జరిగిన క్రిస్మస్ వేడుకల పై నిహారిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరలవుతున్నాయి.
ఇది కూడా చదవండి : కొణిదెల వారి ఆడపడుచు నిహారికకు శుభాకాంక్షలు-చిరంజీవి
క్రిస్మస్ వేడుకల సందర్భంగా నిహారిక కోసం మెగా హీరోలు రాం చరణ్, అల్లు అర్జున్ శాంతాలుగా మారడమే కాక.. సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చిట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిహారిక బన్నీని ఉద్దేశిస్తూ.. ‘పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అయి.. ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నప్పటికి కూడా నాకు మంచి గిఫ్ట్ లు కొనిచ్చేందుకు సమయం వెచ్చించావ్.. థాంక్యూ బన్నీ అన్నా.. కానీ వచ్చే ఏడాది మాత్రం ఇలా మోసం చేయకు’ అని చెప్పుకొచ్చింది నిహారిక. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఇది కూడా చదవండి : 2021లో ఎవరి వల్ల కాలేదు! రికార్డులను తిరగరాస్తున్న పుష్ప