యష్… KGF సినిమాతో ఓ సంచలనం సృష్టించాడనే చెప్పాలి. ఈ చిత్రంలో యష్ క్యారెక్టరైజేషన్, ఎలివేషన్స్ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లాయి. అయితే ఈ సినిమాకు పార్ట్-2 తెరకెక్కి ఈ మధ్య విడుదలైంది KGF-2. ఇటీవలే రిలీజైన ఈ మూవీ KGFను మించి ఉండడంతో సరికొత్త రికార్డులను సైతం తిరగరాస్తోంది. దీంతో ఆయన రేంజ్ మరింత పెరిగినట్లైంది. KGF మూవీతో ఈ శాండిల్ వుడ్ రాకింగ్ స్టార్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగటం విశేషం.
యష్ కన్నడ చిత్రపరిశ్రమలోనే కాకుండా దక్షిణాది వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ డైనమిక్ హీరో నెక్స్ట్ అడుగు ఎటువైపు వేయబోతున్నాడనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది. యష్ నెక్స్ట్ ఎలాంటి పాత్రలు ఉన్న కథలు ఎంచుకుంటాడో అని సినీ విశ్లేషకులు ఎదురు చూస్తున్నారు. దీంతో యష్ కు ఇప్పుడు అసలు సమస్యలు మొదలైనట్లేనని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: తెలుగు స్టార్ హీరోలపై KGF మదర్ క్రేజీ కామెంట్స్.. వీడియో వైరల్!
ఇదిలా ఉంటే తెలుగు టాప్ దర్శకుల్లో ఒకరు ఇద్దరు యష్ తో ఓ సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నారట. KGF సినిమాతో ఆయన రేంజ్ మరింత పెరిగిన విషయం తెలిసిందే. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని యష్ ఇప్పుడు చేయబోయే సినిమాలు కేజీఎఫ్ కు మించి ఉండాలే తప్పా తగ్గకూడని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కాగా యష్ ను కలిసి తెలుగు దర్శకులు ఆయనకు ఓ లైన్ చెప్పారని, దీనికి యష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి యష్ నిజంగానే తెలుగు దర్శకులతోనే సినిమా చేయనున్నాడా? చేస్తే ఎలాంటి కథతో ముందుకు వస్తాడని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. మరి యష్ నెక్స్ట్ ఎలాంటి కథలతో వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.