మధ్యప్రదేశ్ క్రైం- ఈ మధ్య కాలంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి. పైగా సమాజంలో వావి వరసలు మాయమైపోతున్నాయి. లైంగిక కాంక్షతో వరసలను కూడా పట్టించుకోకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. మనం ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా అని ఒక్కోసాకి భయం వేస్తోంది. తాజాగా మేన మాట భార్యను రేప్ చేసిన అల్లుళ్ల ఉదంతం కలకలం రేపుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.
గ్వాలియర్ లోని భారత్ మార్కెట్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి ఉంటోంది. ఆమె భర్త రాత్రి పూట ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆమె ఇంటికి ఎదురుగానే భర్త అక్క ఫ్యామిలీ ఉంటోంది. ఈ క్రమంలో భర్త మేనల్లుళ్లు ఇద్దరు ఆమెపై కన్నేశారు. రెండు నెలల క్రితం అర్ధరాత్రి మేనమామ లేని సమయం చూసి తలుపుకొట్టారు. తలుపు తీసి చూస్తే మేనల్లుళ్లు అరవింద్, సోనూ వచ్చారు.
ఇంత అర్ధరాత్రి వేల వచ్చారేంటని ఆమె అడిగితే.. మామయ్యకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. వారు చెప్పింది నిజమేనని నమ్మని మహిళ ఏ మాత్రం ఆలోచించకుండా వారితో కలిసి బైక్‌పై వెళ్లింది. ఇంకేముంది వాళ్లిద్దరు వరుసకు అత్త ఐన ఆ మహిళను ఆస్పత్రికి కాకుండా దగ్గర్లోని అడవిలోకి తీసుకెళ్లారు. అన్నదమ్ములిద్దరు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత తెల్లవారుజామున ఆమెను ఇంటి దగ్గర వదిలేశారు. ఈ విషయాన్ని భర్తకు చెబితే, అందరికి తెలిసి పరువు పోతుందనే భయంతో ఆమె దుఖాన్ని గిదమింగుకుని మౌనంగా ఉండిపోయింది.
తాము అత్యాచారం చేసినా ఎవ్వరికి చెప్పకపోవడాన్ని ఆసరాగా తీసుకున్న అరవింద్, సోనూ ఆమెను లైంగికంగా మళ్లీ వేధించడం మొదలుపెట్టారు. తమతో అక్రమ సంబంధం కొనసాగించాలని ఆమెపై బెదిరించారు. ఓపిక నశించిన ఆ మహిళ విషయం మొత్తం తన భర్తకు చెప్పేసింది. ఆ తరువాత పోలీసులను ఆశ్రయించడంతో వారు రంగంలోకి దిగి, కేసు నమోదు చేశారు. విషయం తెలిసి నిందితులిద్దరు పారిపోగా, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.