నెల్లూరు జిల్లాలో మహిళా పోలీసులకు యూనిఫామ్ కొలతలు పురుషులు తీసుకోవడంపై కలకలం రేగింది. దీనిపై సదరు మహిళా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పురుషులు కొలతలు తీసుకొనేటప్పుడు అమ్మాయిలం అయినా తాము చాలా ఇబ్బంది పడ్డామని లేడీ కానిస్టేబుళ్లు వాపోయారు. మహిళల డ్రస్ సైజులు పురుషులు తియ్యడమేంటి సర్ అంటూ ప్రశ్నించారు. పురుషులే మహిళ పోలీసుల యూనిఫామ్ కొలతలు తీసుకుంటున్నట్టు ఫొటోలు వీడియోలు బయటకొచ్చాయి. అంతే నెటిజన్లు విషయం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీస్ డిపార్ట్ మెంట్ లోనే ఇలాంటి దారుణం జరగడం ఏంటని నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో నెల్లూరు జిల్లా పోలీసులు హడావిడి పడ్డారు. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఎస్పీ విజయరావు, అడిషనల్ ఎస్పీ వెంకటరత్నమ్మ.. ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. జిల్లా అదనపు ఎస్పీ వెంకట రత్నం అక్కడికి చేరుకొని వెంటనే కొలతలు తీసుకుంటున్న పురుషులను తప్పించి మహిళలతో ఆ పని చేయించారు. ఈ వ్యవహారం జిల్లా ఎస్పీ విజయరావుపై స్పందించారు. టైలర్ మెజర్ మెంట్స్ తీసుకునే ఇంచార్జ్‌గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దని, మహిళల గోప్యతకు భంగం కలిగించే వీడియోలు, ఫొటోలు ప్రసారం చేయొద్దని అన్నారు ఎస్పీ విజయరావు.
ఇది చదవండి: గద్వాల్ బిడ్డకు వీడ్కోలు.. కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు!
జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా పోలీసుల మెజర్ మెంట్స్ ను ఎవరికీ అసౌకర్యం కలగకుండా తీసుకునేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మహిళల రక్షణ, వారి గౌరవం పెంచడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. ప్రస్తుతం మహిళలతోనే అక్కడ కొలతలు తీసుకుంటున్నారు. కొంతమంది కావాలని వీడియోలు వైరల్ చేస్తున్నారని, మహిళా కానిస్టేబుళ్లకు తెలియకుండా వారి యూనిఫామ్ కొలతలు తీసుకునే సమయంలో ఫొటోలు వీడియోలు తీశారని, వారిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
మెజర్ మెంట్స్ తీసుకునే ఇంచార్జ్ గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న జిల్లా యస్.పి. గారు.
◆యస్.పి. గారి సమక్షంలో అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారి ఆధ్వర్యంలో ఉమెన్ SI, ఉమెన్ టైలర్స్, స్టాఫ్ ద్వారా తీసుకుంటున్న మహిళా పోలీసుల క్లాత్స్ మెజర్ మెంట్స్.. (1/3) pic.twitter.com/n991eLcnRz— Nellore Police (@sp_nlr) February 7, 2022