ఒలింపిక్స్ లో బంగారు పతకం. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారతీయులు 100 ఏళ్ళ నుండి కంటున్న కల ఇది. టోక్యో ఒలింపిక్స్ వేదికగా ఆ కల ఇప్పుడు నిజం అయ్యింది. ఆ కలని నిజం చేసిన భరతమాత ముద్దుబిడ్డ మాత్రం ఒకే ఒక్కడు. అతనే నీరజ్ చోప్రా. అతని వయసు కేవలం 23 సంవత్సరాలే. కానీ.., నీరజ్ చోప్రా ఆశయం మాత్రం 100 ఏళ్ళ చరిత్రని తిరగరాయడం. భరతమాత మెడలో బంగారు పతాకాన్ని సింగారించడం. నీరజ్ చోప్రా ఆ విజయాన్నే సాధించాడు. జన్మనిచ్చిన గెడ్డ ఋణం తీర్చుకున్నాడు. అసలు ఇంతకీ ఎవరీ నీరజ్ చోప్రా? ఎక్కడ నుండి వచ్చాడు? అతని పూర్తి జీవితం ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం రండి.
నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా.. 24 డిసెంబర్, 1997 లో జన్మించాడు. హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఖాంద్రా అతని సొంత గ్రామం. నీరజ్ తండ్రి ఓ చిన్న కౌలు రైతు. చిన్నప్పుడు నీరజ్‌కు క్రికెట్ అంటే మహా ఇష్టం. వేగంగా బౌలింగ్ వేసేవాడు. కానీ.., స్కూల్ లో కోచ్ అతని చేతిలోని వేగాన్ని గుర్తించాడు. అతను విసరాల్సింది బాల్స్ కాదు. జావెలిన్ అని గుర్తించాడు. ఆ ఒక్క నిర్ణయం నీరజ్ చోప్రా తలరాతనే కాదు, ఒలింపిక్స్ లో నేడు ఇండియా తలరాతనే మార్చేసింది.
నీరజ్ ఈ ఆట మీద ఎక్కువ ఆసక్తి చూపించడానికి కారణం మాత్రం జైవీర్ అనే అథ్లెట్. జైవీర్ ప్రాక్టీస్ చేస్తుంటే చూసి.., నీరజ్‌కు కూడా అతనిలా జావెలిన్ విసరాలని ఆశపడ్డాడు. ఇందుకోసం అలాజజ పంచ్‌కులలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉండి జావెలిన్‌లో శిక్షణ తీసుకున్నాడు. చదువు అయిపోయాక నీరజ్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిపోయాడు. దేశానికి ఏమైనా చేయాలి అన్నది అతని కల. ఇందుకోసం ప్రాణం ఇవ్వడానికి అయినా సిద్ధం.
ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తునే.., జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. ఇండియన్ ఆర్మీ కూడా అతని ప్రతిభని గుర్తించింది. ఎక్కడ పోటీలు జరుగుతున్నా అక్కడికి పోవడానికి సహకారం అందించింది. ఇలా నీరజ్ పై దేశం పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. 130 కోట్ల మంది కలను నిజం చేస్తూ.., ఈరోజు నీరజ్ ఓ అద్భుతం సృష్టించాడు. అందుకే నీరజ్ నీకు దేశం అంతా గర్వంతో నిండిన హృదయంతో సలాం చేస్తోంది. హేట్సాఫ్ నీరజ్ చోప్రా. మరి.. నీరజ్ చోప్రా సాధించిన ఈ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.