మనకి వస్తే కష్టం. మన వాళ్ళకి వస్తే నరకం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్తునూర్ గ్రామానికి చెందిన మల్లయ్య దంపతులు ప్రస్తుతం అలాంటి నరకాన్నే అనుభవిస్తున్నారు. కూలి పనులు చేసుకుని జీవించే వీరికి ఆరేళ్ళ క్రితం ఓ బాబు పుట్టాడు. ఆ పిల్లాడికి మనోజ్ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. కానీ.. వయసు పెరిగే కొద్దీ ఆ బాబు తల భాగం అసాధారణంగా పెరుగుతూ వచ్చింది. కొన్నాళ్ళకి తమ బిడ్డకి ఏదో వింత వ్యాధి ఉన్నట్టు ఆ తల్లిదండ్రులు తెలుసుకున్నారు.
జిల్లా హాస్పిటల్ కి మనోజ్ ని తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్స్ కి ఆ వ్యాధి అంతుబట్టలేదు. తమ స్థోమతకు మించి.., బిడ్డకన్నా ఎక్కవ ఏమి కాదనుకుని కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు. డాక్టర్స్ చెప్పిన అన్నీ టెస్ట్ లు చేపించారు. అయినా.. మనోజ్ కి వచ్చిన వ్యాధి ఏమిటో డాక్టర్స్ కనిపెట్టలేకపోయారు. ఇప్పటికీ మనోజ్ పరిస్థితి అలానే ఉంది.
తమ బిడ్డ ట్రీట్మెంట్ కోసం ఇప్పటికే ఆ తల్లిదండ్రులు పూర్తిగా అప్పులు చేసేశారు. ఇప్పుడు వారి చేతిలో ఒక రూపాయి కూడా లేదు. పోనీ ఎవరైనా దాతలు ముందుకొచ్చి మనోజ్ కి సహాయం చేయాలన్నా..ఆ వ్యాధి ఏమిటో ఇప్పటికీ నిర్ధారణ కావడం లేదు. మనోజ్ తల్లదండ్రులు మాత్రం మా బిడ్డని బతికించండయ్య అంటూ.., అందరిని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్ కేసుని ప్రత్యేకంగా గుర్తించి, తెలంగాణ ప్రభుత్వం అతని పురాణాలను కాపాడే బాధ్యత తీసుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.