దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థల్లో పనిచేసేందుకుగాను నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1925 పోస్టులను భర్తీ చేయనుంది. అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ (సివిల్), స్టెనో గ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింట్ స్టాఫ్, మహిళా స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషిన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ తదితర విభాగాల్లో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఖాళీల వివరాలు, అర్హతలు..
అప్లై చేసుకునే విధానం..
దరఖాస్తుకు ఫిబ్రవరి 10 ఆఖరు తేదీ. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు కంప్యూటర్ ఆధారిత టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఎంపిక ప్రక్రియలో అసిస్టెంట్ కమీషనర్, అసిస్టెంట్ కమిషనర్ (అడ్మిన్), జూనియర్ ఇంజనీర్ పోస్టులకు అప్లే చేసిన అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఇంటర్వ్యూ (సివిల్)లో వారి పనితీరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.