ఫిల్మ్ డెస్క్- జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు నవీన్ పొలిశెట్టి. స్క్రిప్ట్ రైటర్‌గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నవీన్, ఆ తరువాత చిన్న చిన్న పాత్రల చేస్తూ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో నటుడిగా మారాడు. ఇక జాతి రత్నాలు చిత్రం అనూహ్య విజయం సాధించడంతో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ఇక ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడీ హీరో.
ఇక అసలు విషయానికి వస్తే నవీన్ పోలిశెట్టి, తెలంగాణ మంత్రి, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ట్వీట్ చేసి నెటిజన్స్ చేతిలో దారుణంగా ట్రోల్ అవుతున్నాడు. ఈ రోజు శనివారం జులై 24 మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు కావడంతో నవీన్ పోలిశెట్టి ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కి శుభాకాంక్షల్ని తెలియజేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నా, హ్యాపీ బర్త్ డే రియల్ తెలంగాణ జాతి రత్నం కేటీఆర్ గారు, కరోనా సమయంలో మీరు చేసిన సహాయాల గురించి ఎన్నో వార్తలను చదివాను, థ్యాంక్యూ సార్, మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలి.. అంటూ విష్ చేశాడు నవీన్.
మంత్రి కేటీఆర్‌ని జాతిరత్నం అని పోల్చడంతో నవీన్ పోలిశెట్టి ట్వీట్‌పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఒక్క రోజు అయినా హాస్పటల్స్ బిల్స్ గురించి అడిగావా, హెల్ప్ చేసిన వాళ్లకంటే వెయ్యి రెట్లు బిల్స్ కట్టలేక చనిపోయిన వాళ్లు ఉన్నారు, ఇలా బూట్లు నాకొద్దు ప్లీజ్ అని ఒక నెటిజన్ నవీన్ పై సీరియస్ గా మండిపడ్డాడు.
మరో నెటిజన్.. ఆపరా బాబూ ఈ డబ్బా కొట్టడం అని వెటకారం చేశాడు. ఐతే కొందరు మాత్రం నవీన్ పొలిశెట్టిని వెనకేసుకొచ్చారు. పాపం జస్ట్ బర్త్ డే విషెస్ చెబితే ఇంతలా కామెంట్స్ చేయాలా అని మద్దతు పలికారు. కానీ దీనిపై నవీన్ మాత్రం స్పందించలేదు.
Happy birthday real Telangana Jaathi Ratnam @KTRTRS Garu 🙂 So many stories of you helping out during the pandemic . Thank you sir . Wishing you health and happiness.
— Naveen Polishetty (@NaveenPolishety) July 23, 2021