‘కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలంటే దేవుడే దిగిరావాలి’ ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. అదే దేవుడు మనిషి రూపంలో వస్తే.. ఎలా ఉంటుందో కదా?. బాగా డబ్బు సంపాదించి రిచెస్ట్ మ్యాన్ గా నిలవాలనుకునే ఈ రోజుల్లో ఆలాంటి మనుషులు కూడా ఉన్నారా? అనేగా మీ సందేహం. డబ్బు కోసం నానా రకాల గబ్బు పనులు చేసే వారున్న ఈరోజుల్లో.. ఆ డబ్బునే తృణప్రాయంగా వదులుకున్నాడు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్. ఆ సంస్థ డెలివరీ ఏజెంట్ల పిల్లల చదువు కోసం సుమారు రూ.700 కోట్ల (90 మిలియన్ డాలర్ల) విరాళం ప్రకటించారు.
జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్స్ కార్యకలాపాల కోసం ఆయన ఈ భారీ విరాళాన్ని ప్రకటించారు. కంపెనీ ఉద్యోగులకు ఈ-మెయిళ్ళ ద్వారా ఈ సమాచారాన్ని చేరవేశారు. ఎంప్లాయీస్ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్(ఈసోప్స్) కోసం ఈ నిధులను కేటాయించనున్నారు. జొమాటో డెలివరి పార్ట్‌నర్స్ ఇద్దరు పిల్లలకు చదువు చెప్పించడానికి రూ. లక్ష చొప్పున కేటాయిస్తుంది కంపెనీ. అయిదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న వారు దీనికి అర్హులు. పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకుని ఉంటే వారి ఇద్దరు పిల్లల చదువు కోసం రూ. 2 లక్షల అందించనున్నారు.
#Zomato‘s Founder and CEO #DeepinderGoyal will be donating around $90 million (nearly ₹700 crore) to help fund the education of children of its delivery partners.
Read https://t.co/3lx7nQKuCt pic.twitter.com/JKjxfYbrjk
— Hindustan Times (@htTweets) May 6, 2022
“True wealth is not measured in money. It is measured in the legacy we leave behind”
What an #inspiring move by @deepigoyal, The donation covers education of up to 2 children,50,000 per child annually for partners who are with Zomato for more than 5years.https://t.co/0JOibhEIg0
— TheAstuteReader (@TheAstuteReader) May 6, 2022
ఇది కూడా చదవండి: Young Girl పెళ్లికూతుర్లకు ఉచితంగా బట్టలు అందిస్తున్న పేద యువతి! ఎందుకంటే..
మహిళా ఫుడ్ డెలివరీ పార్ట్‌నర్స్ కోసం అదనపు సౌకర్యాన్ని కల్పించింది. పన్నెండవ తరగతి పూర్తి చేసుకున్న బాలికల కోసం ప్రైజ్ మనీని ప్రవేశపెట్టింది. ఉద్యోగులు, సిబ్బంది పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా స్కాలర్‌షిప్ వ్యవస్థను కంపెనీ ప్రవేశపెట్టనుంది. విధి నిర్వహణలో ఉంటూ ప్రమాదానికి గురైన ఫుడ్ డెలివరీ పార్ట్‌నర్స్ కుటుంబాలను ఆదుకోవడానికి, వారి పిల్లల చదువుల కోసం కూడా ఈ రూ. 700 కోట్ల నుంచి వ్యయం చేయనున్నట్లు తెలిపింది జొమాటో కంపెనీ. ఈ విషయంలో సర్వీస్‌తో సంబంధముండదు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి కూడా ఈ సౌకర్యం వర్తింపజేసింది.
కాగా.. ఇది తొలి అడుగు మాత్రమేనని, మరిన్ని వసతులు, సౌకర్యాలను తన సంస్థలో పని చేస్తోన్న ఉద్యోగుల కోసం ప్రవేశపెడతామని దీపిందర్ గోయెల్ తెలిపారు. ఈ క్రమంలో జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్స్ కోసం విరాళాలను కూడా సేకరించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు బాగుంటేనే సంస్థ పురోగమిస్తుందన్న విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు అయన వ్యాఖ్యానించారు. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయనున్నట్లు దీపిందర్ గోయల్ వెల్లడించారు.
Zomato founder @deepigoyal to donate Rs 700 Cr of vested ESOPs to Zomato Future Foundation. The money will be used to educate children of @zomato delivery partners. Details below 👇
What a great cause!! pic.twitter.com/7uClEpXj19— Nayantara Rai (@NayantaraRai) May 6, 2022
ఇది కూడా చదవండి: Sisters: కోటిన్నర విలువైన భూమిని మసీదుకు రాసిచ్చిన మహిళలు.. ఒక కన్నీటి కథే ఉంది!