గడిచిన వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు దేశంలో చాలా చోట్ల నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలాచోట్ల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. ఇటు తెలంగాణలో భద్రాచలం వద్ద గోదావరి సైతం ఉగ్రరూపం దాల్చింది. దాదాపు చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు ఆకతాయిలు చేస్తున్న పనులు సహాయక సిబ్బందిని ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి.
కొందరు ఆకతాయిలు చేసే పనులు నిజంగా అవసరంలో ఉన్న వారికి సాయం అందకుండా చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని ఎంతో మంది ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు చెప్పుకోబోయే యువకుడిలాంటి వారు కోరి తంటాలు కొనితెచ్చుకుంటున్నారు. జోరుగా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్రలోని మాలేగావ్ లో గిర్ణా నది పొంగి పొర్లుతోంది.
పొంగి పొర్లుతున్న గిర్ణానదిని చూసేందుకు ఎంతో స్థానికులు అక్కడకుచేరుకుంటున్నారు. అలా చేరుకున్న వారిలో ఓ 23 ఏళ్ల కుర్రాడు మాత్రం చూస్తూ ఊరుకోకుండా ఓ తుంటరి పని చేశాడు. తన మిత్రుడుని వీడియో తీయమని చెప్పి వంతెనపైనుంచి హీరోలా నదిలోకి డైవ్ చేశాడు. అక్కడి నుంచి ఆ వరద నీటిలో గల్లంతు అయ్యాడు. అక్కడున్న వాళ్లకు అసలు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే అంతా జరిగిపోయింది.
జులై 13న ఈ ఘటన జరగ్గా రెండ్రోజులపాటు సహాయక బృందాలు అతని కోసం గాలించాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతని ఆచూకీ లభించలేదు. అతను బ్రతికే ఉన్నాడా? లేక మృతి చెందాడా అనేదానిపై కూడా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆ యువకుడు డైవ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువకుడు చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
मालेगाव, नाशिक : स्टंटबाजी करत तरुणाने गिरणा पुलावरुन नदीत मारली उडी; बेपत्ता तरुणाचा शोध सुरु…#Nashik #Malegaon #HeavyRain #Stunt #ViralVideo
Video Credit: Abhijeet Sonawane pic.twitter.com/zB3HgUIQEW
— Akshay Baisane (अक्षय बैसाणे) (@Baisaneakshay) July 14, 2022