యువకుడి కోసం ఓ యువతి తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టు గురించిన తెలిసిన నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.
‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాలో హీరో, హీరోయిన్లు ట్రైన్‌లో కలుసుకుంటారు. తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండానే విడిపోతారు. హీరో మీద ప్రేమ పెంచుకున్న హీరోయిన్ అతడి కోసం హైదరాబాద్ నగరం మొత్తం గాలిస్తుంటుంది. ఏకంగా టీవీలో యాడ్ కూడా ఇప్పిస్తుంది. అది సినిమా కాబట్టి.. చివరకు ఇద్దరూ కలుసుకుంటారు. సినిమా హ్యాపీ ఎండింగ్‌కు వస్తుంది. కానీ, నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరగటం అసాధ్యం. కానీ, ఓ యువతి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపింది. ఓ హోటల్‌లో కలిసిన వ్యక్తి కోసం ఓ ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ ద్వారా ఇద్దరూ కలుసుకున్నారు. అయితే, ఆ తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో నెటిజన్లు ఆ యువతిపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. మంజరి అనే యువతి కొద్దిరోజుల క్రితం తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ‘‘ నేను ఎరోసిటీ కేఫ్‌లో పాస్తా ఆర్డర్ చేసిన ఈ వ్యక్తి కోసం చూస్తున్నాను. రాత్రి 1 గంట ప్రాంతంలో అతడ్ని చూశాను. అతడు బ్లాక్ టీ షర్ట్, మంచి కళ్లతో అందంగా ఉన్నాడు. అతడితో మాట్లాడాలని అనుకున్నాను. కానీ, క్యాబ్ డ్రైవర్ నాకు పదే పదే ఫోన్ చేయటం వల్ల అక్కడినుంచి వెళ్లిపోయాను. ట్విటర్ నీ పని నువ్వు చేసి, అతడ్ని వెతకటంలో సహాయం చేయి’’ అని రాసుకొచ్చింది. ఆ పోస్ట్ కాస్తా వైరల్‌గా మారింది. ఆ పోస్టుకు అతడి దగ్గరినుంచి రిప్లై వచ్చింది. ‘‘ నేను మిమ్మల్ని చూసినట్లు గుర్తొస్తోంది. మిమ్మల్ని మళ్లీ ట్విటర్‌లో కలవటం సంతోషం.
మీతో ఇలా చాటింగ్ చేయటం నాకు సంతోషంగా ఉంది’’ అని అన్నాడు. అతడి ట్వీట్‌కు ఆమె రిప్లై ఇచ్చింది. ‘‘ మీరు చాలా తియ్యగా ఉన్నారు. నేను మీ ప్రైవసీకి భంగం కలిగించి ఉంటే క్షమించండి. నా ఉద్దేశ్యం లేదు’’ అని పేర్కొంది. అయితే, వీరిద్దరూ స్నేహితులని నెటిజన్లకు తెలిసింది. బర్డ్ యాప్ ప్రమోషన్ కోసం వాళ్లు ఇలా చేశారని తెలిసింది. దీంతో నెటిజన్లు యువతిపై ఫైర్ అవుతున్నారు. ‘‘ నువ్వు అసలు ఆడపిల్లవేనా’’ అంటూ మండిపడుతున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
looking for this guy who ordered pasta in an Aerocity cafe today around 1 pm. he was kinda ripped, in a black shirt and had nice eyes…wanted to talk to him, but missed it coz my cab guy kept calling me.
twitter do your thing and help me find him pic.twitter.com/4Yid5p1ofc
— manjari (@manjaribinnani) May 4, 2023