అట్టడుగు వర్గాలపై నాటినుండి నేటి వరకు కులవివక్ష చూపుతూనే ఉన్నారు. అగ్ర కులాల వారు దళితులపై, గిరిజనులపై అకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. అలాంటి సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. గిరిజన యువకునిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమాజంలో సామాజికంగా సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. వాటిని అమలు చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ షెడ్యూల్ తెగల, కులాల వారికి విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ కూడా అమలు చేస్తుంది. దీనిని బట్టి ఏం తెలుస్తుందంటే.. సాటి మనుషులపై కులవివక్ష చూపకూడదు. సమాజంలో అన్ని కులాల వారు గౌరవించబడాలి. సమాన అవకాశాలను కల్పించాలి. కులం పేరుతో వ్యక్తిని కించపరచకూడదు. అయినా కూడా మనం అక్కడక్కడ కులంపేరుతో నిందించడం, అవమానించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. ఓ మూర్ఖుడు ఫుల్లుగా మందుకొట్టి, తాగిన మైకంలో ఓ వ్యక్తి గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. ఈ వీడియో కాస్త పోలీసుల దాకా చేరింది. దీంతో పోలీసులు మూత్రవిసర్జన చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అసలు వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ సీదీలో ఓ గిరిజన యువకుడిపై ఓ యువకుడు మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో వైరల్ అయి పోలీసుల దాకా వెళ్లింది. పోలీసులు మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. నిందితుడు బీజేపీ పార్టీలో సంబంధం ఉందని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఆరోపించింది. అవి నిరాధారమైన ఆరోపణలని భారతీయ జనతా పార్టీ ఖండించింది. నిందితుడు ప్రవేశ్ శుక్లపై బహారీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని ముఖ్యమంత్రి ఆఫీస్ అధికారి తెలిపారు. జరిగిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శిరాజ్‌సింగ్ చౌహాన్ చాలా సీరియస్ అయ్యారు.
CM స్పందిస్తూ.. ‘సీదీ జిల్లాలో జరిగిన ఒక వైరల్ వీడియో తన దృష్టికి వచ్చిందని, దోషిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాన’ని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ‘ సీదీ జిల్లాకు చెందిన గిరిజన యువకుడిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన దారుణానికి సంబంధించిన వీడియో తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రస్తుత నాగరిక సమాజంలో ఇలాంటి హేయమైన చర్యకు చోటులేదు. నిందితుడికి బీజేపీతో సంబంధం ఉందని, ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని సిగ్గుపడేలా చేసిందని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని, మధ్యప్రదేశ్ లో గిరజనులపై అఘాయిత్యాలు ఆపాల’ని కమల్‌నాథ్ అన్నారు.