సమాజం అనేక రకాల మనసత్వాలు కలిగిన వారు ఉంటారు. ముఖ్యంగా కొందరి మనసత్వం, ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటివి తెలిసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా ఒడిశాకు చెందిన ఓ యువకుడి మనసత్వం చాలా విచిత్రంగా ఉంది. ఆ యువకుడు 21ఏళ్లుగా అన్నం తినడం లేదు.
సమాజం అనేక రకాల మనసత్వాలు కలిగిన వారు ఉంటారు. ముఖ్యంగా కొందరి మనసత్వం, ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటివి తెలిసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అలానే మనం తినే ఆహారం విషయంలోను కొందరికి విచిత్రమైన మనసత్వం ఉంటుంది. తాజాగా ఓ యువకుడిని విషయం తెలిస్తే కూడా మీరు ఆశ్చర్య పడక మానరు. ఆ యువకుడి అన్నం అంటే భయం. అందుకే అటుకులనే ఆహారంగా తింటూ జీవిస్తున్నాడు. అలా ఒకటి రెండు కాదు ఏకంగా 21 ఏళ్లగా అటుకులనే ఆహారంగా తీసుకుంటూ జీవిస్తున్నాడు. మరి.. ఆ వ్యక్తి ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా మథిలి సమితిలోని ధుంగియాపుట్ పంచాయతీ పత్రపుట్ గ్రామంలో పార్వతి సగరియా, మను సగరియా అనే దంపతులు ఉంటున్నారు. వీరికి కిశోర్ సగరియా అనే 21 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ దంపతులు ఇద్దరు కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే వారి కుమారుడు కిశోర్ లో అరుదైన వింత మనస్తత్వాన్ని పార్వతి సగరియా దంపతులు చిన్నతనంలోనే గుర్తించారు. అతడి విచిత్ర మనసత్వం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆ వింత అలవాటు ఏమిటంటే.. కిశోర్ సగరియా 21 సంవత్సరాల్లో ఒక్కసారైనా అన్నం తీసుకోలేదు. కేవలం అటుకులు, మరమరాలు, పరోటాలు మాత్రమే తింటున్నాడని అతడి తల్లి చెబుతోంది. కిశోర్ కి చిన్నతనం నుంచి అన్నం చూస్తే భయంమంట. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు గ్రామస్థులు ఎంత నచ్చజెప్పినా ముద్ద కూడా ముట్టుకోనే లేదంట. ఇప్పటికి 21 ఏళ్లు వయస్సు వచ్చినా అన్నం తప్ప ఇతర పదార్థాలనే కిశోర్ ఆహారంగా తీసుకుంటున్నాడు.
మరి.. అన్నం కాకుండా అటుకులు, మరమరాలు తినడం వలన ఏమైన సమస్య ఉందా? అని అడ్డగా.. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ యువకుడు పేర్కొంటున్నాడు. ఇక ఈ విషయం గురించి డాక్టర్ల వద్ద ప్రస్తావించగా.. అన్నం తీసుకుంటేనే శరీరానికి అవసరమైన శక్తి చేకూరుతుందన్నారు. ప్రస్తుతానికి కిశోర్ ఆరోగ్యంగా ఉన్నా భవిష్యత్ లో సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. మరి.. ఈ యువకుడి విచిత్ర మనసత్వంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.