ప్రస్తుతం సోషల్ మీడియాను ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. దీంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన నెటింట్లో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అలానే కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఫేమస్ అవుతుంటారు. మరికొందరు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. తాజాగా ఓ యువకుడు రోడ్డుపై నోట్ల కట్లను విసిరి.. హంగామా సృష్టించాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాను ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. దీంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన నెటింట్లో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అలానే కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఫేమస్ అవుతుంటారు. ఇప్పటికే ఎంతో మంది సోషల్ మీడియాను ఉపయోగించుకుని మంచి గుర్తింపు సంపాదించారు. అలా చాలా మంది తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం వివిధ రకాల వీడియోలు చేస్తూ నెటింట్లో పోస్ట్ చేస్తుంటారు. కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. చిత్రవిచిత్ర వేషాలు వేస్తూ.. నెట్టింట వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా కొందరు యువకులు కారులో వెళ్తూ నోట్ల కట్టలను రోడ్డుపైకి విసిరేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో లో చూసినట్లయితే.. హర్యానా లోని గురుగ్రామ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డు ప్రాంతంలో కొందరు యువకులు కారులో ప్రయాణం చేస్తూ తెగ హంగామా సృష్టించారు. ఓ యువకుడు కారు వెనుక వైపు కూర్చోని కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరాడు. ఆ వ్యక్తి ముఖానికి కర్చీప్ కట్టుకుని కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయింది. వీడియో కాస్తా చివరకు పోలీసుల వద్దకు చేరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ యువకుడు విసిరిన నోట్లు నకిలీవా? లేక నిజమైన నోట్లా? అనేది తెలియరాలేదు. ఢిల్లీకి చెందిన ఓ యూట్యూబర్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవలే విడుదలైన ‘ఫర్జీ’ వెబ్ సీరిస్ లోని ఓ సన్నివేశంలోనూ.. ఇద్దరు వ్యక్తులు కారులో నుంచి నకిలీ కరెన్సీ నోట్లను రహదారిపైకి విసురుతూ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఫర్జీ వెబ్ సీరిస్ లోని ఆ సీన్ ను అనుకరించే యత్నంలో ఈ యువకులు పోలీసులకు చిక్కారు. వీడియో కేవలం 15 సెకన్లు మాత్రమే ఉంది. కారు డిక్కిలో కూర్చోని డబ్బును రోడ్డుపై విసిరేస్తున్న సమయంలో వెనుక నుంచి ఎవరో వీడియో తీశారు. ఈ సీన్ మొత్తం రాత్రివేళలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Haryana: A video went viral where a man was throwing currency notes from his running car in Gurugram. Police file a case in the matter.
(Police have verified the viral video) pic.twitter.com/AXgg2Gf0uy
— ANI (@ANI) March 14, 2023