ప్రధానంగా మన ప్రజాప్రతినిధుల వద్దకు ఏదైన సమస్య పరిష్కారం గురించి వెళ్తాం. లేదంటే మా గ్రామంలో అభివృద్ధి జరగటం లేదని, నిధులు విడుదల చేయాలంటూ కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు లేక కొందరు సమాజ శ్రేయస్సు కోరే యువతులు నియోజకవర్గ ఎమ్మెల్యేకు లేఖలు రాయటం సహజం. కానీ ఓ యువకుడు మాత్రం కాస్త వింతగా ఆలోచించి ఏకంగా ఎమ్మెల్యేకు లేఖ రాశాడు. ఎందుకు రాశాడు? . అసలు ఆ లేఖలో ఏం ప్రస్తావించాడనే కదా మీ ప్రశ్నలు?
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన భూషణ్ జాంబవత్ అనే యువకుడు రాజౌరా ఎమ్మెల్యే సుభాష్ దోతేకు లేఖ రాశాడు. స్థానికంగా చాలా మంది అమ్మాయిలు ఉన్నారని, ఒక్కరు కూడా నా వంక చూడటం లేదని ఆ యువకుడు ఆవేదనతో లేఖలో తెలిపారు. ఇదే కాకుండా ఇప్పటికీ ఏ అమ్మాయి కూడా నాకు పరిచయం కాలేదని, భవిష్యత్ లో దోరుకుతుందో లేదో అని భయంగా ఉందంటూ ఆ యువకుడు తెలిపాడు.
ఇక దీంతో పాటు చాలా మంది అమ్మాయిలు తాగుబోతు యువకులను మాత్రమే నమ్ముతున్నారని, నా లాంటి వారిని ఇష్టపడటం లేదంటూ తన ఆవేదనను వెల్లగక్కాడు. ఇక ఈ లేఖపై స్పందించిన ఎమ్మెల్యే ఆ యువకుడి పేరును బట్టి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కానీ పూర్తి వివరాలు మాత్రం లభించలేదు. ఇక ఈ యువకుడు రాసిన లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.