యన్టీఆర్ నటించిన స్టూడెంట్ నం.1 సినిమా అందరికి తెలిసిందే. అందులో హీరో యన్టీఆర్ ఆవేశంలో చేసిన నేరానికి జైలుకు వెళ్తాడు. తనకు ఇష్టమైన లా చదువు ను అక్కడి నుంచి పూర్తి చేస్తాడు. ఇది రీల్ స్టూడెంట్ నం.1 స్టోరీ. రియాల్ లైఫ్ లో ఇలాంటివి జరగడం అరుదు. కానీ అలాంటి అరుదైన ఘటన బీహార్ లో జరిగింది. ఓ కుర్రాడు ఆవేశంలో చేసిన నేరానికి జైలుకెళ్లాడు. అక్కడ నుంచి చదివి ఆలిండియాలో మంచి ర్యాంకు సాధించి..రియల్ స్టూడెంట్ నం.1 అని అనిపించుకున్నాడు. మరి.. ఆ యువకుడు ఎవరు? ఆ కథేమిటే ఇప్పుడు తెలుసుకుందాం..
బీహార్ లోని నవాడా జిల్లా మోస్మా గ్రామానికి చెందిన సూరజ్ అలియాస్ కౌశలేంద్ర ఓ హత్య కేసులు గత ఏడాది ఏప్రిల్ నుంచి అండర్ ట్రయల్ ఖైదీగా జైల్లో ఉంటున్నాడు. అయితే తనకు చదువుపై ఉన్న ఆసక్తికి అక్కడి జైలు అధికారులకు తెలిపాడు. అక్కడి అధికారుల సహకారంతో జైలులో ఉంటు పరీక్షలు సిద్ధమయ్యాడు. IITల మాస్టర్స్ (JAM) కోసం జాయింట్ అడ్మిషన్ టెస్ట్‌లో ఇతడు ఎవరూ ఊహించిన ర్యాంకు సాధించాడు. ఇటీవల రూర్కీ ఐఐటీ నిర్వహించిన ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో 54వ ర్యాంకు సాధించాడు.సూరజ్ విజయానికి జైలు పరిపాలన అధికారుల నుంచి కూడా పెద్ద సహకారం లభించింది. వాస్తవానికి పరిశీలనలో ఉన్న ఖైదీ సూరజ్ వారిస్లిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్మా గ్రామానికి చెందినవాడు. మరి..ఈ రియల్ స్టూడెంట్ నం.1 పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.