ఓ యువకుడు ప్రియురాలిపై కోపంతో తన మర్మంగాన్ని బ్లేడ్ తో కట్ చేసుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే?
లవ్ లో ఉన్న ప్రేమికులు అప్పుడప్పుడు గొడవలు పడడం సహజం. కానీ, ఇంతదానికే కొందరు క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఓ యువకుడు మాత్రం తన ప్రియురాలిపై కోపంతో తన మర్మంగాన్ని బ్లేడ్ తో కట్ చేసుకుని చివరికి ఆస్పత్రి బెడ్ పై పడి ఉన్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనకు దారి పరిస్థితులు ఏంటి? అసలేం జరిగిందంటే?
బెంగాల్ కు చెందిన ప్రసన్న జీత్ ప్రస్తుతం గుజారాత్ లోని రాజ్ కోట్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటూ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడు పని చేస్తున్న కంపెనీలో ప్రసన్న జీత్ ఓ అమ్మాయితో లవ్ లో పడ్డాడు. ఆ యువతి కూడా ఇతని ప్రేమను అంగీకరించింది. దీంతో ఇద్దరు తరుచు సినిమాలు, షికారులు అంటూ తిరుగుతూ తెగ ఎంజాయ్ చేశారు. అలా వీరి లవ్ చాలా రోజుల వరకు వెళ్లింది. ఇకపోతే గత కొంత కాలం నుంచి ఈ ప్రేమికులు తరుచు గొడవలు పడుతున్నారు. అయితే ఇటీవల వీరిద్దరూ వీడియో కాల్ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే మాట్లాడుకుంటూనే ఇద్దరూ మరోసారి గొడవ పడ్డారు. ఇక కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు క్షణికావేశంలో ఊహించిన పని చేశాడు.
ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూనే బ్లేడ్ తో తన మర్మంగాన్ని కట్ చేసుకున్నాడు. ఈ సీన్ చూసిన చూసిన ప్రియురాలు ఒక్కసారిగా షాక్ గురైంది. వెంటనే స్పందించిన అతని కుటుంబ సభ్యులు ప్రసన్న జీత్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రసన్న జీత్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రియురాలిపై కోపంతో తన మర్మంగాన్ని కట్ చేసుకున్న యువకుడి చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.