గంజాయి సరఫరాను అరికట్టేందుకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ.. గంజాయి ముఠాను పట్టుకుని అరెస్టు చేసి జైళ్లకు కూడా పంపిస్తున్నారు. అయితే ఈ గంజాయి తనిఖీల్లో అసలు కేటులుగాళ్లు తప్పించుకుంటున్నారు. దీంతో పోలీసుల కళ్లుగప్పి అనేక విధాలుగా గంజాయిని, వాటి తాలుక డబ్బులను సరఫరా చేస్తున్నారు. తాజాగా గంజాయి ముఠాను పట్టుకునేందుకు ఓ యువకుడిని తనిఖీ నిర్వహించిన పోలీసులు ఖంగుతిన్నారు. ఆ యువకుడి వద్ద నోట్ల కట్టాలను చూసి అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే..
రైళ్లలో హవాలా డబ్బులు, గంజాయి, మద్యం స్మగ్లర్లను పట్టుకునేందుకు చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలో ఆంధ్రా నుంచి వచ్చిన యువకుడు అనుమానస్పందగా కనిపించాడు. అతడి అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. అతడి చొక్క లోపల సుమారు రూ.30లక్షలు, బ్యాగ్‌లో మరో రూ.30 లక్షలను రైల్వే పోలీసులు గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా రాజమండ్రి నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్తున్ననట్లు చెప్పాడు. అయితే టికెట్ మాత్రం విజయవాడ నుంచి చెన్నైకి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రైళ్లలో హవాలా డబ్బులు, గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామని.. ఇందులో భాగంగా చేపట్టిన సోదాల్లోనే భారీగా నగదు పట్టుబడిందని, మరింత సమాచారం కోసం యువకుడిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించింది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#chennai pic.twitter.com/gJLbXuJ7Ip
— Sekhar Rambo (@RamboSekhar) June 25, 2022