కాలం మారింది. 100 ఏళ్ల పాటు గుండ్రాయిలా బతికిన ఒకప్పటి మనుషుల్ని దారుణంగా బలహీనపర్చింది. వాయు వేగంతో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ఆహారపు అలవాట్లు మనిషిని చావుకు దగ్గర చేస్తున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన తర్వాత వచ్చిన కొన్ని వ్యాధులు.. ఇప్పుడు 20 ఏళ్లకే వస్తున్నాయి. పసి పిల్లల్ని కూడా హింసిస్తున్నాయి. గుండెపోటు ఒకప్పుడు 50 ఏళ్లు పైబడ్డ వారికి వచ్చేది. అంతకంటే తక్కువ వయసున్న వారికి గుండెపోటు వస్తే.. దాన్నో ఏడో వింతగా చూసే వారు జనం. ఒక్కసారిగా కంగారు పడిపోయేవారు. చాలా జాగ్రత్తగా ఉండాలని జనం కలవరపడియేవారు.
కానీ, ఇప్పుడు 20 ఏళ్ల వయసు వారికి కూడా గుండెపోటు వస్తోంది. గుండె పోటుతో యువకులు మృతి చెందిన ఘటనలు చాలా చోటుచేసుకున్నాయి.. చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, ఓ యువకుడు రోడ్డుపై నడుస్తూ గుండెపోటుతో మరణించాడు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా రోడ్డుపైనే కుప్పకూలాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, మీరట్‌కు చెందిన ఓ యువకుడు డిసెంబర్ 2న తన మిత్రులతో కలిసి రోడ్డుపై వెళుతున్నాడు. అసలే రాత్రి.. పైగా చలిగా ఉండటంతో అందరూ ఒణుకుతూ నడుస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే నీలం రంగు హుడీ ధరించిన వ్యక్తి ఆరోగ్యంలో ఉన్నట్టుండి మార్పులు వచ్చేశాయి. నడుస్తూనే ఓ సారి గట్టిగా తుమ్మాడు. అలాగే నడుస్తూ కొద్ది దూరం వరకు వెళ్లాడు. ఓ చోట మరో మిత్రుడిపై చెయ్యి పెట్టి కిందకు పడిపోయాడు. అతడి ఫ్రెండ్స్ ఎంత పైకి లేపటానికి ప్రయత్నించినా అతడు లేవలేదు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా అతడు మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ వ్యాక్సిన్స్ ప్రయోగాల తర్వాత ఇలాంటివి ఎక్కువయిపోయాయి’’.. ‘‘ చిన్న వయసులోనే గుండెపోటులు రావటం బాధాకరం’’ అని కామెంట్లు చేస్తున్నారు.
2 Dec 2022 : 🇮🇳 : A young man died due to 💔 attack💉 while walking.
Why? Because “Cov-ID-AI 💉 strong association with cardiovascular RIP”
Why? Because “India made a record of doing the biggest 💉campaign in human history”
But the gov. says I am not responsible.#heartattack pic.twitter.com/v89e9h5k6o
— Anand Panna (@AnandPanna1) December 4, 2022