చిన్న పిల్లలు ఇంట్లో మారం చేస్తుంటే వారికి ఏదైని బొమ్మలు కొనిపిస్తే ఆడుకుంటూ ఎంతో మురిసిపోతారు. ఇక ఇంట్లో ఏదైనా కొత్త వస్తువులు కొంటే ముందుగా మురిసిపోయేది చిన్నారులే. ఆటవస్తువులు, సైకిల్, బైక్, టీవీ, కారు ఇలా ఏ వస్తువు తీసుకున్నా కేరింతలు కొడుతూ సంబరంగా మురిసిపోతారు. చిన్న చిన్న విషయాలకే ఆనందాన్ని వెతుక్కునేవారు మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు. తమ స్థాయికి తగ్గట్లు ఇంట్లో వస్తువులు కొంటే ఆ ఇంట్లో పిల్లల హడావుడి, సంతోషం మాటల్లో చెప్పలేం. ఓ బాలుడు సంతోషానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పేదరికంలో ఉన్న ఓ తండ్రి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్నాడు.. సైకిల్‌కు ఓ దండ వేసి పూజ చేస్తున్నాడు.. ఇది చూసిన అతడి కుమారుడి ఆనందానికి అవదులే లేవు.. ఆనందంతో తెగ గెంతులు వేస్తున్నాడు. ఆ కుర్రాడు పడుతున్న ఆనందాన్ని చూసి తండ్రి కూడా తెగ మురిసిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలు గెల్చుకుంది.
సోషల్ మీడియాలో ఎన్నో సామాజిక అంశాలకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేసే ఐఏఎస్ ఆఫీసర్ అవనీశ్ శరణ్ ఈ తండ్రీ కొడుకుల అనుబంధానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఎంతో సంతోషంగా ఉందని.. ఇది గొప్ప అనుభూతి అంటూ రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో ఆనందాన్ని ఇస్తున్న ఈ వీడియోని 1.7లక్షల మంది వీక్షించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
It’s just a second-hand bicycle. Look at the joy on their faces. Their expression says, they have bought a New Mercedes Benz.❤️ pic.twitter.com/e6PUVjLLZW
— Awanish Sharan (@AwanishSharan) May 21, 2022