మార్కెట్‌కు వెళితే ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు. ఇటీవల పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయుటకు, పేదలకు సరసమైన ధరలకు కందిపప్పు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం కీలక నిర్ణయానికి వచ్చింది. నిత్యావసరాల ధరలపై సతమతమవుతున్మాన సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది కేంద్రప్రభుత్వం.
దేశంలో ప్రస్తుతం ధరల సంక్షోభం నడుస్తుంది. మనం వాడే నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. కూరగాయలు, కిరాణ సరుకులు, పప్పు ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే పప్పు ధాన్యాల ధరలు 7 నుండి 32 శాతం వరకు పెరిగాయని కేంద్రం తెలిపింది. సామాన్య ప్రజలు బతుకలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కందిపప్పు కిలోకు రూ.130 కి చేరుకుంది. ఇటీవల టమాట ధర అయితే హద్దే లేకుండా పోయింది. కేజీ రూ.150 నుండి రూ.200 వరకు పలుకుతుంది. టమాటతోపాటే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ధరలు కూడా పరుగెడుతున్నాయి.
మార్కెట్‌కు వెళితే ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు. ఇటీవల పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయుటకు, పేదలకు సరసమైన ధరలకు కందిపప్పు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం కీలక నిర్ణయానికి వచ్చింది. భారత్ బ్రాండ్ పేరుతో కేంద్రం దేశం మొత్తం మీద 702 నాఫెడ్, మదర్ డైరీ వంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దుకాణాల ద్వారా అమ్మడానికి నిర్ణయించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పప్పుల్లో వివిధ రకాల పప్పులు ఉంటాయి. వాటి క్వాలిటీని బట్టి రేటు మారుతూ ఉంటుంది. కందిపప్పు ధర కనిష్టంగా కేజీ ధర రూ.80 నుంచి 135 రూపాయల వరకు కొనసాగుతుంది. నాణ్యమైన పప్పును తగ్గింపు ధరలో అందించాలని.. సబ్సిడీపై కేవలం కిలో 60 రూపాయలకు భారత్ దాల్
బ్రాండ్ పేరుతో అమ్మటానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. భారత్ దాల్ పేరుతో టమాటాలను విక్రయించిన తరహాలోనే కందిపప్పును అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. మన దేశ సాంప్రదాయ వంటకాల్లో కందిపప్పు అతి ముఖ్యమైంది. అయితే కందిపప్పు ధరలకే రెక్కలొస్తున్నాయి. కూరగాయల్లో టమాట, పచ్చిమిర్చి ముఖ్యమైనవి. వీటి ధరలు మార్కెట్లో మండిపోతున్నాయి.
రాష్ట్రాల్లో చౌకధరల దుకాణాల్లో, సహకార సంఘాలు, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడిచే షాపుల ద్వారా వీటిని సరఫరా చేసి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. సబ్సిడీపై కిలో కందిపప్పు రూ.60కు.. కిలో టమాట రూ. 60 కే అందించాలని నిర్ణయించింది. భారీగా పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మీకు దగ్గరలో ఉన్న రేషన్ షాపుల్లో ఎంక్వైరీ చేసి కొనుగోలు చేయండి. జూలై 17 నుండే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం.