జీవితంలో ఎంతటి వాళ్ళకైనా.. కష్టాలు, కన్నీరు, బాధలు, ఇబ్బందులు సహజమే. అవన్నీ దాటుకుని ముందుకి వెళ్తేనే నిజమైన విజేతలుగా నిలువగలం. కానీ.., చాలా మంది సామాన్యులు ఈ కష్టాలను అధిగమించలేక ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్దింటి కుటుంబాల్లో కూడా ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఇంట కూడా ఇలాంటి విషాదమే నెలకొంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఇది చదవండి : అనారోగ్యంతో భార్య మృతి.. అంత్యక్రియలు అవ్వగానే..
బీఎస్ యడియూరప్ప మనవరాలు సౌందర్య ఆత్మహత్య చేసుకుంది. ఈ శుక్రవారం ఉదయం 10 గంటలకి బెంగుళూరులోని ఓ అపార్ట్ మెంట్ లో సౌందర్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సౌందర్య వయసు ప్రస్తుతం 30 సంవత్సరాలు. ఇక బౌరింగ్ ఆస్పత్రిలో సౌందర్య పోస్ట్ మార్టం జరుగుతుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఆమె ఆత్మహత్యకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇక యడియూరప్ప మనవరాలు సౌందర్యకి రెండేళ్ల క్రితం వివాహం కాగ.., వీరికి నాలుగు నెలల పాప కూడా ఉంది. వృత్తిరీత్యా డాక్టరైన సౌందర్య ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.