కరోనా క్లిష్ట సమయంలో లాక్‌డౌన్ కారణంగా దాదాపు చాలా పరిశ్రమలు మూతబడ్డ సంగతి తెలిసిందే. ఇల్లు దాటి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఐటీ కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌ను అమలులోకి తీసుకొచ్చాయి. దీంతో ఉద్యోగులు హ్యాపీగా ఇంట్లో ఉంటూ జాబ్ చేసుకుంటూ వచ్చారు. లాక్‌డౌన్ ఎత్తేసినప్పటికీ ఇప్పటికీ చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌ని కంటిన్యూ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే కంపెనీల పాలిట శాపంగా మారింది. కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఐటీ ఉద్యోగులు ఏకకాలంలో 2,3 ఉద్యోగాలు చేస్తూ లక్షలు వెనకేసుకున్నారన్న వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2020 మార్చి నుండి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీల్లో 90 శాతం మంది ఉద్యోగులు ఇంట్లోనే ఉంటూ వర్క్ చేస్తున్నారు. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఐటీ ఉద్యోగులు కంపెనీలని మోసం చేస్తున్నారని పలు కంపెనీలు ఆరోపిస్తున్నాయి.
ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ప్లేస్లిప్‌ని చూపించి డబుల్ సేలరీతో మరో జాబ్ తెచ్చుకుంటున్నారు. మరి కొంతమంది ఐతే ఏకంగా ప్రాక్సీకి పాల్పడుతున్నారు. బీటెక్ పూర్తయిన వారితో ఆన్‌లైన్ జాబులకి అప్లై చేయిస్తారు. వారి స్కైప్‌లో వీడియో ఇంటర్వ్యూలో లిప్ కదుపుతుంటే, ఈ టెకీలు వారి తరపున మాట్లాడుతుంటారు. దీంతో ఆ బీటెక్ స్టూడెంట్‌కి ఎంఎన్‌సి కంపెనీల్లో జాబ్ వస్తుంది. అయితే ఇలా చేసినందుకు సదరు టెకీకి జీతంలో కొంత కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఆ బీటెక్ పర్సన్ పూర్తిగా సబ్జెక్ట్ నేర్చుకునే వరకూ సదరు టెకీ.. సపోర్ట్ చేస్తుంటాడు. దీన్నే ప్రాక్సీ అంటారు. అయితే ఇలాంటివి జరగడం అనేది సహజమేనని అంటున్నారు.
దీని వల్ల కంటే కంపెనీ డేటాను ఇతర కంపెనీలకు షేర్ చేయడమనేది అతి పెద్ద ప్రమాదమని భావిస్తున్నాయి పలు కంపెనీలు. కంపెనీ డేటా అనేది చాలా విలువైనది. ఈ విషయంలో డేటా గోప్యత కోసం ఆయా కంపెనీలు కొన్ని వెబ్ సైట్లను అనుమతించవు. అయితే కొంతమంది రెండు, మూడు ఉద్యోగాలు చేస్తూ కంపెనీ ప్రాజెక్టు డేటా వివరాలను ఇతర కంపెనీలకి షేర్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని ఆయా కంపెనీలు భయపడుతున్నాయి. ఇలాంటి స్కామ్‌లు జరుగుతున్నాయని భావించిన పలు కంపెనీలు.. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌కి ముగింపు పలుకుతూ వెంటనే ఉద్యోగులను ఆఫీసులకి రావాలని పిలుపునిచ్చాయి. మరి ఐటీ ఉద్యోగుల గోల్‌మాల్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.