కర్ణాటకలో ఇటీవల శక్తి యోజన పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు రద్దీ రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది.
ఈ మద్య కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మద్య కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సిద్ద రామయ్య పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అంతేకాదు వినూత్న పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ భాగా పెరిగిపోవడంతో వారి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఓ బస్సులో మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా సిద్ద రామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నిక ప్రచారంలో రాష్ట్రంలోని మహిళలంతా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన అధికార పార్టీ ఆ మాట నిలబెట్టుకున్నారు. ‘శక్తి యోజన’ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళ ప్రయాణికుల తాకిడి రోజు రోజుకీ పెరిగిపోతూ ఉంది. బస్సులో రద్దీ ఎక్కువ పెరిగిపోవడంతొ మహిళల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి.
ఉచిత ప్రయాణం కావడంతో ఏ ఊరిలో చూసినా ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సీట్ల కోసం మహిళలు గొడవలకు ఎగబడుతున్నారు. ఓ బస్సులో చుట్టు ప్రయాణికులు ఉన్నారన్న కనీస జ్ఞానం లేకుండా చీరలు లాగి, జట్లు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శక్తి యోజన పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అని చెప్పినప్పటి నుంచి దాదాపు 20 శాతం వరకు మహిళలు ప్రయాణ బస్సుల్లో ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉన్నట్లు కండక్టర్లు చెబుతున్నారు. గొడవలు జరిగినపుడు చుట్టు ఉన్నవారు కనీసం ఆపకుండా కళ్లు అప్పగించి చూస్తున్నారు. ప్రస్తుతం మహిళల మధ్య గొడవకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.