అర్థరాత్రి చిన్న అలికిడి అయితేనే భయంతో గజగజ వణికిపోయే వారు ఎందరో ఉన్నారు. అలాంటిది అర్థరాత్రి.. తలుపులు దబదబ బాదితే భయంతో గుండె ఆగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పోనీ, ధైర్యం చేసి వెళ్లి డోర్ ఓపెన్ చేశామనుకోండి.. ఎదురుగా నగ్నంగా ఓ స్త్రీ కనిపిస్తే.. భయంతో కిందపడిపోతారు. కాస్త పిరికి వారు అయితే ఏకంగా పైకే పోతారు. ఇదుగో ఓ ప్రాంత ప్రజలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అర్థరాత్రి ఓ మహిళ నగ్నంగా మారి.. వీధుల వెంట తిరుగుతూ డోర్లు కొడుతూ ప్రజలను భయపెడుతుంది. ఎందుకు..? ఏంటి..? అన్నది తెలుసుకుందాం..
మిలాక్.. ఉత్తరప్రదేశ్, రాంపూర్ పరిధిలోని ఓ చిన్న గ్రామం. ఇన్నాళ్లు ఎలాంటి సమస్యలు లేకుండా ఊరి ప్రజలంతా సంతోషంగా జీవించేవారు. అలాంటి ఊరిని ఓ 25 ఏళ్ల యువతి భయంతో గజగజ వణికిస్తోంది. రాత్రి అయ్యిందంటే చాలు.. అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు ఉండట్లేదు. ఇంతకీ ఆమె ఏం చేస్తుందంటారా..? అర్థరాత్రి సమయంలో నగ్నంగా వీధుల వెంట తిరుగుతుంది. అంతేకాదు.. ఇంటి డోర్లు తడుతుంది. కాలింగ్ బెల్ నొక్కుతుంది. డోర్ ఓపెన్ చేసే ప్రయత్నమూ చేస్తోంది. ఇన్నాళ్ల్లు రాత్రుళ్లు దయ్యాలు సంచరిస్తున్నాయని పుకార్లొచ్చినప్పటికీ.. తాజగా, ఆ యువతి చేస్తున్న పనులు సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రాత్రుళ్లు ఓ యువతి నగ్నంగా గ్రామంలోని ఇళ్ల తలుపులు తడుతున్నట్టు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం రాత్రి ఒంటి గంట సమయంలో స్థానికి మాజీ కౌన్సిలర్ ఇంటి తలుపును ఆ నగ్న మహిళ తట్టినట్టు సీసీకెమెరాల్లో రికార్డైంది. ఈ దృశ్యాలను చూసి గ్రామ ప్రజలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పోనీ, ధైర్యం చేసి.. యువతికి ఎదురుపడదామా అంటే.. ఆమె మానసిక పరిస్థితి ఏంటో తెలియదు.. ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడుతున్నారు. ఆ నగ్న మహిళ ఎవరు..? నగ్నంగా ఇంటి తలుపులు ఎందుకు తడుతోంది..? అసలు ఆమె మనిషేనా..? అంటూ ఒకరికొకరు చర్చించుకుంటూ భయభ్రాంతులకు లోనవుతున్నారు. కాగా.. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ యువతిపై.. మీ అభిప్రాయాలేంటో..? మీరైతే ఈ పరిస్థితులతో ఏం చేస్తారో..? కామెంట్ల రూపంలో తెలియజేయండి.
यूपी के रामपुर में निर्वस्त्र महिला से दहशत ! आधी रात में खटखटाती है घर के दरवाजे, CCTV वीडियो हुआ वायरल#Rampur #CCTV #ViralVideo pic.twitter.com/UN16rpf2Rk
— India TV Hindi (@IndiaTVHindi) February 2, 2023