సాధారణంగా నదులు ప్రవాహిస్తున్నప్పుడు ఎవరూ దాటే సాహసం చేయరు. అలానే నీరు నది నిండుగా కనిపిస్తున్న అవతలి గట్టుకు దాటే ధైర్యం ఎవరు చేయరు. కేవలం నదులు, సముద్రాలపై దేవుళ్లు నడిచేవారని మనం పురాణాల్లో చదివాము. తాజాగా ఓ వృద్ధ మహిళా కూడా నర్మద నది నీటిపై నడుచుకుంటూ వెళ్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
సాధారణంగా నదులు ప్రవాహిస్తున్నప్పుడు ఎవరూ దాటే సాహసం చేయరు. అలానే నీరు నది నిండుగా కనిపిస్తున్న అవతలి గట్టుకు దాటే ధైర్యం ఎవరు చేయరు. కేవలం నదులు, సముద్రాలపై దేవుళ్లు నడిచేవారని మనం పురాణాల్లో చదివాము. అంతే తప్ప నిజ జీవితంలో నది నీటిపై నడిచిన వ్యక్తులను చూడటం చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. తాజాగా ఓ వృద్ధ మహిళా కూడా నర్మద నది నీటిపై నడుచుకుంటూ వెళ్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె నీటిపై నడవటం చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు అయితే ఆమెను ‘నర్మదా మాత’ అని పిలుస్తూ ఆశీర్వదం కోసం క్యూ కట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ జిల్లాలో నర్మదా నదిలో నిర్మలమైన నీటిలో ఓ వృద్ధురాలు నడుస్తూ వెళ్లింది. అయితే ఆమె నీటిపై నడవటం చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియోల పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్ అవ్వడంతో ఆమెను చూసేందుకు వందల మంది నది ఒడ్డుకు తరలి వచ్చారు. తెల్లటి చీర కట్టుకున్న ఆ వృద్ధ మహిళ నీటి నుంచి బయటకు రావడం వారు చూశారు. అలా బయటకు వస్తున్న ఆమెను “నర్మదా మాతా” అంటూ అక్కడ వచ్చిన వారు జయజయధ్వానాలు చేశారు. అలానే మరికొందరు ఆమె నది నీటిపై నడవంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అలానే స్థానిక పోలీసులకు ఈ వృద్ధ మహిళకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. దీంతో మిస్టరీగా మారిన నది నీటిపై నడిచే విషయాన్ని తేల్చడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. తన పేరు జ్యోతి రఘువంశీ అని నర్మదా నది నీటిపై నడిచేందుకు దాదాపు 10 నెలల కిందటనే ఇంటి నుంచి వచ్చేశాసని పోలీసుల విచారణలో ఆమె తెలిపారు. ఆధ్యాత్మిక తపన గల వారిలో చాలా తక్కువ మంది ఈ విధమైన సాహసోపేతమైన ప్రయత్నాలకు పూనుకుంటారని ఆ వృద్ధురాలు అన్నారు.
ఇక ఆమె నది నీటిపై నడిచిన విషయానికి వస్తే.. నీటి మట్టం చాలా తక్కువగా ఉన్న ప్రదేశంలో ఆ పెద్దావిడ నడుస్తోన్నారు. పైగా ఆమె నడుస్తున్న ప్రాంతంలో నీటి అడుగున ఇసుక దిబ్బలు మేట వేశాయి. ఆ మహిళ తన అనుభవంతో లోతులేని ప్రదేశాల్లో మాత్రమే అడుగులు వేస్తూ నదీ ప్రవాహాన్ని దాటారు. దూరం నుంచి వీడియో తీయడం వలన నీటిపై నడుస్తున్నట్లు భావన కలిగింది. ఏది ఏమైనప్పటికీ ఏ వృద్ధ మహిళ.. ఇలా నదిలో చేస్తున్న సాహస యాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.
@saurabhtop @TheLallantop @zoo_bear @ANI
please do fact check and analysis of below..
Location : narmada river, Jabalpur #narmadamata @ChouhanShivraj pic.twitter.com/5IPL8vHx4e— Maseeeeha (@kedar5gautam) April 8, 2023