ఈ మద్య ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా ఫేమ్ కావాలని చూస్తున్నారు. ఇందుకోసం రక రకాలుగా ఫీట్స్ చేస్తూ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ మద్య టిక్ టాక్ తో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా అనేది జీవితంలో ఒక అంతర్భాగమైంది. సోషల్ మీడియాలో స్పెషల్ గా ఉండేందుకు ట్రై చేస్తూ ఉంటారు.. కొంతమంది ఇందులో సక్సెస్ అవుతారు.. మరికొంత మంది దారుణంగా ఫెయిల్ అవుతుంటారు. ఓ యువతి చీర కట్టులో స్కూటీపై బ్యాక్ ఫ్లిప్ చేయాలని చూసి పట్టుతప్పిపోయింది.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ మద్య సోషల్ మీడియాలో కొంత మంది రక రకాలు స్టంట్స్ చేస్తూ అందరి దృష్టిని తమ వైపు తిప్పుకుంటున్నారు. కొంత మంది యువతులు సాంప్రదాయ చీరకట్టులో సాహసాలు చేస్తూ అబ్బురపరుస్తున్నారు. ఓ యువతి రోడ్డు పక్కన ఓ స్కూటీ పై నిలబడి చాలా స్టైలిష్ లుక్ తో కనిపించింది. కొద్ది సేపటి తర్వాత స్కూటీ పై నుంచి బ్యాక్ ఫ్లిప్ చేసింది. చివరి మువ్ మెంట్ లో యువతి నేలపై పట్టు తప్పి పడిపోయింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఎందుకొచ్చిన తంటా.. ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవసరమా.. అంటూ రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.