వివాహబంధంతో ఒక్కటైన దంపతులను పిల్లా పాపలతో నూరేళ్లూ వర్ధిల్లాలని పెద్దలు దీవిస్తుంటారు. స్త్రీ మాతృత్వపు ఆనందాన్ని పొందే సమయంలో కుటుంబ సభ్యులు తల్లిబిడ్డ క్షేమం కోసం సీమంతం జరిపిస్తారు.. ఆ సమయంలో గర్భంతో ఉన్న ఆడవారి ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా తమ ఇంట్లో ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం జరిపించారు. సుజాతా భారతి అనే మహిళ ఈ వీడియో షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సాధారణంగా మనిషికి ఎంతో విశ్వాసంగా ఉండే కుక్కలను తమ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ఈ మద్య కాలంలో తాము ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న కుక్కలకు పుట్టిన రోజు, సీమంతం కార్యక్రమాలు ఘనంగా జరుపుతున్నారు. బంధు మిత్రులను ఆహ్వానించి వింధుభోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా సుజాత అనే మహిళ తన పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం నిర్వహించింది.. ఈ వీడియోలో కుక్కకు కొత్త బట్టలు అలంకరించి, బొట్టు పెట్టి, గాజులు తొడిగింది. ఆ తర్వాత కుక్కకు ఎంతో ఇష్టమైన భోజనం కూడా వడ్డించింది. అంతే కాదు విధిలో కుక్కలకు భోజనం పంచడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ కాలంలో కొంతమంది బంధాలు.. బంధుత్వాలకు ఏమాత్రం విలువుల ఇవ్వడం లేదు.. అలాంటిది పెంపుడు కుక్కకు అలా గ్రాండ్ గా సీమంతం నిర్వహించిన సుజాత అనే మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియో 50 లక్షల మంది వీక్షించారు. గతంలో తమిళనాడు సిల్కాలీ, మధురై సిటీ, ఖమ్మం జిల్లాల సత్తుపల్లి లో తాము సొంత బిడ్డల్లా సాదుకుంటున్న కుక్కలకు సీమంతం ఎంతో వైభవంగా జరిపించడమే కాదు.. వింధుభోజనాలు కూడా ఏర్పాటుచేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలిజయండి.