‘నేను తాగుబోతును అస్సలు పెళ్లిచేసుకోను’ అని తెగేసి చెప్పింది. అదే సమయంలో వధువు పెళ్లికి నిరాకరించినట్టు తెలిసిన వరుడి స్నేహితులు.. మద్యం మత్తులో అనరాని మాటలు అనేశారు.
పెళ్లి అంటే జీవితంలో ఎంతో ముఖ్యమైనది. మనకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటే జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది.. అనే నమ్మకం ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నిజంగా అదృష్టం. కానీ, ఈ మధ్య కాలంలో అనుకోని కారణాల వలన.. అది చిన్న చిన్న విషయాలకు పెళ్లిళ్లు ఆగిపోవడం అనేది ఎక్కువయిపోయింది. ఆ కోవకు చెందిన ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ లోని వారణాసి జిల్లాకు చెందిన జన్సా అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వీరి పెళ్లి మే 21 ఆదివారం జరిపించాలని ఇరు కుటుంబాలు ముహుర్తం పెట్టుకుని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కళ్యాణ మండపానికి ఊరేగింపులో వరుడు చేరుకున్నాడు.
దీంతో అతడికి వధువు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అందరూ కలిసి స్వాగతం పలికారు. ఇదంతా జరిగిన తర్వాత వరుడు, అతడి స్నేహితులు మండపం పైకి వెళ్లి కేకలు వేయడం, అలాగే వారు మద్యం సేవించి రావడం చూసి వేదికపై ఉన్న వారికి కోపం వచ్చేసింది. వధువు మాత్రం వేదికపైన అలానే కూర్చుని ఉంది. ఇంతలోనే పెళ్లి ముహుర్తానికి అతడు మెడలో దండ వేస్తుండగా వధువు కి మద్యం సేవించిన వాసన రావడం గమనించింది. వెంటనే వధువు వేదికపై నుంచి కిందికి దిగి ఫంక్షన్ హాల్ లోని ఓ గదిలోకి వెళ్లిపోయింది. ఆ క్రమంలోనే ఆమెను ఒప్పించడానికి పెద్దలు, కుటుంబసభ్యులు అనేక రకాలుగా కొన్ని గంటల నుంచి ప్రయత్నం చేశారు. కానీ, ఆ యువతి లో మార్పు రాలేదు.
‘నేను తాగుబోతును అస్సలు పెళ్లిచేసుకోను’ అని తెగేసి చెప్పింది. అదే సమయంలో వధువు పెళ్లికి నిరాకరించినట్టు తెలిసిన వరుడి స్నేహితులు.. మద్యం మత్తులో అనరాని మాటలు అనేశారు. అలాగే వరుడి సోదరుడు సైతం వధువును బ్రతిమలాడే ప్రయత్నం చేశాడు. ఆమె తన పట్టు వదల్లేదు. పోలీసులు రంగంలోకి దిగినా.. ఫలితం లేకుండా పోయింది. పెళ్లి నిశ్చయమైన నాటినుంచి పెళ్లి కుమారుడు తనతో తాగి తప్పుగా మాట్లాడేవాడని పెళ్లి కుమార్తె పోలీసులకు తెలిపింది. ఎంత చెప్పినా అతడు మారకపోవటంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అంది. దీంతో పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.