రాజకీయాలు అంటే చాలా మందికి ఓ రకమైన నెగిటీవ్ అభిప్రాయం ఉంటుంది. అందులో నిజాయితీ పరులు నిలబడలేరనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఇలా అభిప్రాయ పడేవాళ్ల తప్పా.. అందులోకి వెళ్లి నిజాయితీగా ప్రజా సేవ చేయడాని ముందడుగు వేసే వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే యువతలో కూడా చాలా మంది ఈ రాజకీయాలు తమకేందుకులే అని వివిధ రంగాల్లో ఉద్యోగాలు సంపాదించి.. బాగా స్థిర పడిపోతున్నారు. అయితే చాలా తక్కువ మంది యువత మాత్రమే ప్రజాసేవ చేసేందుకు తాము సాధించిన కొలువులను సైతం త్యాగం చేస్తున్నారు. ఇలాంటి వారిలో ఒకరు బీహార్ కు చెందిన డాలీ అనే మహిళ. లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని ప్రత్యక్షంగా ప్రజా సేవ చేయాలని సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి.. విజయం సాధించింది. అయితే ఆమె సాధించిన విజయం అంత ఆషామాషీగా అందలేదు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బీహార్ కి చెందిన డాలీ ఎంబీఏ చదుకుని..దాదాపు 10 ఏళ్ల పాటు మల్టీనేషనల్ కంపెనీల్లో పని చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో పుట్టిన డాలీ.. బీహార్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత డాలీ ఢిల్లీకి మకాం మార్చారు. ఆమెకు చిన్నతనం నుంచి సమాజానికి సేవ చేయడంపై చాలా ఆసక్తి ఉండేది. పెళ్లైన తరువాత కూడా చిన్న చిన్న సేవకార్యక్రమాలు చేస్తుంటారు. కొన్నేళ్లా నుంచి పలు కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. నెలకు లక్షకు పైగా జీతం వస్తున్నా ఆమెకు సంతృప్తిగా అనిపించలేదు. తనలోని కోరికను భర్తకు తెలియజేయడంతో ఆయన ఒప్పుకున్నాడు.
దీంతో ఢిల్లీ నుంచి 2018లో తన అత్తవారి ఊరైనా బీహార్ లోని షాదీపూర్ కి వెళ్లారు. అలానే ఈ ఏడాది అక్కడ జరిగిన పంచాయతీ ఉపఎన్నికల్లో సర్పంచ్ గా పోటి చేశారు. అయితే ఇక్కడ డాలీకి ఓ సమస్య వచ్చి పడింది. ఆ పంచాయతీలోని ప్రజలెవ్వరూ ఆమెకు తెలియదు. డాలీ కూడా అక్కడి ఓటర్లు అంతగా పరిచయం లేదు. అలానే ప్రత్యేర్థి స్థానికంగా బాగా తెలిసిన వ్యక్తి. దీంతో డాలీకి ఈ పోటీ పెద్ద సవాళ్లగానే మారింది. అనవసరంగా మంచి ఉద్యోగాన్ని వదులుకుని ఇలా వచ్చి ఇబ్బందులు పడుతున్నావని ఆమె కుటుంబ సభ్యులు అనేవారు. ఇదే సమయంలో ఆమెకు ఓ ఐడియా వచ్చింది. వాళ్ల అత్తగారు గతంలో సర్పంచ్ గా పోటీ చేసింది. దీంతో ఇదే అస్త్రంగా మార్చుకుని ఫలానా వారి కోడల్ని అంటూ గ్రామ ప్రజలతో కలిసిపోయింది.
తమ కుటుంబం వారు గతంలో చేసిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ చేస్తానని ప్రజలకు ఆమె మాట ఇచ్చారు. గట్టిగా ప్రచారం చేయడంతో ఆ ఎన్నికల్లో కేవలం 50 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఆమె స్థానిక సంప్రదాయాలను పాటించడం ప్రారంభించారు. రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదని, కానీ ప్రజలకు సేవచేయాలనే తపన బాగా ఉందని అందుకే సర్పంచ్ గా పోటీ చేసినట్లు ఆమె తెలిపారు. పంచాయతీ పరిధిలోని తాగు నీరు, ఇతర సౌకర్యాలు అందిస్తానని ఆమె తెలిపారు. మరి.. డాలీ రాజకీయ ప్రస్థానం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.