ఇటీవల దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల వర్షాల కారణంగా రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యాయి. ఈ పరిస్థితి దేశం అంతటా ఉంది. రోడ్ల పరిస్థితి మెరుగు పర్చాలని విపక్షాలు ఎన్నో రకాలుగా అధికార పక్షంపై నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళా ఎమ్మెల్యే అక్కడ రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని వినూత్నంగా నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ ఘటన జార్ఖండ్ గొడ్డా జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్ గొడ్డా జిల్లాలో రహదారుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అక్కడ రోడ్లన్నీ బీటలు వారిపోయాయి.. దీంతో రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు రోడ్లపైకి వచ్చినపుడు ఎన్నో కష్టాలు పడుతున్నామని.. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ దృష్టికి తీసుకు రావడంతో.. ఆమె రోడ్లను మరమ్మత్తు చేయించాలని పలుమార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించింది. కానీ వారు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వారిపై నిరసనకు దిగింది. రహదారిపై ఉన్న బురుదలోకి దిగి స్నానం చేసి వినూత్నంగా నిరసన తెలిపింది. అధికారులు వచ్చి ఎంతగా వారించినా.. ఆమె మాత్రం తన నిరసన కొనసాగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దీపికా పాండే మాట్లాడుతూ.. తాను ఎప్పటి నుంచో అధికారులకు ఈ విషయం గురించి చెబుతున్నానని.. కానీ వారు ఏమాత్రం రోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల మద్య ఎలాంటి గొడవలు ఉన్నాయో తనకు తెలియదని.. రోడ్డు వెడల్పు కోసం అధికారలు మే 2022 లో చర్యలు చేపట్టినప్పటికీ.. కేంద్రం ఇప్పటి వరకు నిధులు మంజూ చేయకపోవడం వల్లనే ఆ దుస్థితి నెలకొందని అన్నారు. అధికారులు ఇప్పటికైనా రహదారి పనులు చేపట్టి ప్రజలను ఇబ్బందుల తొలగించాలని కోరుతున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Protest for Good #Roads.
Mahagama #Congress MLA Deepika Pandey Singh takes bath in a pothole filled with rain water at #Jharkhand‘s #Godda district to mark her protest.@INCIndia @nsui pic.twitter.com/F6SDNdD0XC— Deepak Mahato (@deepakmahato) September 21, 2022