కలికాలం మహిమో.. లేక మనుషుల్లో సభ్యత, సంస్కారాలు తగ్గిపోతున్నాయో తెలియదు కానీ.. విపరీత చర్యలు చోటు చేసుకుంటున్నాయి. విచ్చలవిడితనం పెచ్చుమీరుతోంది. మరీ ముఖ్యంగా వావి వరసలు మరిచి అనైతిక సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఆఖరికి అమ్మ అనే పదానికే కళంకం తీసుకువస్తున్నారు. కుటుంబ సభ్యుల గురించి పక్కకు పెడితే.. కనీసం సభ్య సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచన కూడా మరిచి.. విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా కొడుకు, సోదరుడి వరుస అయిన వారితోనే ప్రేమ, పెళ్లి అంటూ పిచ్చి వేషాలు వేస్తున్నారు. తాజాగా ఈ కోవకుచెందిన సంఘటన ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బజ్పూర్ ప్రాంతంలోని సింగ్ నగర్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళ సొంత కుమారుడిని వివాహం చేసుకుంది. విషయం తెలిసిన భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఆ వివరాలు..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సింగ్ నగర్‌కి చెందిన ఇంద్రరామ్ అనే వ్యక్తికి పదకొండు సంవత్సరాల క్రితం బబ్లీ అనే మహిళతో వివాహం అయ్యింది. అప్పటికే ఆమెకు మరో వ్యక్తితో వివాహం అయ్యి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మొదటి భర్త ఆమెను వదిలేసి, పిల్లలను తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆమె ఇంద్రరామ్‌ని రెండో వివాహం చేసుకుంది. వారికి మరో ముగ్గురు సంతానం జన్మించారు. ఇలా ఉండగా.. గత కొంత కాలం నుంచి బబ్లీకి మొదటి భర్త వల్ల కలిగిన కుమారుడు ఆమె ఇంటికి రావడం ప్రారంభించాడు. పోను పోను వారి మధ్య సంబంధాలు బాగుపడ్డాయి. ఎంతైనా కన్న బిడ్డ కదా అని ఇంద్రరామ్.. ఆ యువకుడు ఇంటికి వచ్చినా.. బబ్లీతో మాట్లాడినా ఏం అనేవాడు కాదు. అయితే అదే అతడి కొంప ముంచింది.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: స్టేషన్ లో వెక్కి వెక్కి ఏడ్చిన కానిస్టేబుల్.. ఎందుకంటే!
వావి వరసలు మర్చిపోయిన బబ్లీ.. సొంత కుమారుడినే పెళ్లి చేసుకుంది. అంతేకాక ఇంట్లో దాచిన 20 వేల రూపాయలు తీసుకుని వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ఇంద్రారామ్ వారిద్దరి గురించి చుట్టుపక్కల గాలించాడు.. తెలిసిన వారిని అడిగాడు. లాభం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య సొంత కుమారుడినే వివాహం చేసుకోవడమే కాక.. ఇంట్లో దాచిన 20 వేల నగదుతో పరారయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Verdict: బ్రిటీష్ కాలంలో మొదలైన వివాదం..108 ఏళ్ల తర్వాత తీర్పు!