దేశాన్ని అభిమానించని పౌరులు ఉంటారా? దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా భయపడని వారు ఎందరో ఉన్నారు. దేశభక్తి అనేది ఓ ఎమోషన్. అలాంటిది దేశంపై ఉన్న ఇష్టాన్ని ముఖంపై పెయింటింగ్ రూపంలో చూపించిన ఓ మహిళను ఒక ఆలయంలోకి రానివ్వలేదు. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు..
మాతృదేశంపై ఎవ్వరికైనా ప్రేమ ఉండటం సహజం. జన్మనిచ్చిన నేలను గౌరవించనివారు ఉంటారా చెప్పండి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో సమరయోధులను చాలా మంది స్ఫూర్తిగా తీసుకుంటారు. వారి తరహాలోనే దేశం కోసం తాము కూడా ఏదో ఒకటి చేయాలని సంకల్పం తీసుకుంటారు. తాము ఎంచుకున్న రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకుని దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని ప్రయత్నిస్తుంటారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడరు. కుటుంబాలను కూడా కాదని కేవలం దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్నవారు కూడా ఎందరో ఉన్నారు. బయటకు వ్యక్తపరచకున్నా దేశం అంటే పడిచచ్చే వారు ఎందరో ఉన్నారు.
కొందరు మాత్రం దేశం మీద తమకు ఉన్న ప్రేమకు అవకాశం దొరికినప్పుడల్లా చూపిస్తుంటారు. అలాంటి ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ముఖం మీద జాతీయ జెండా పెయింటింగ్ వేసుకుని వెళ్లిన ఓ భక్తురాలిని పంజాబ్లోని ప్రసిద్ధ స్వర్ణమందిరంలోకి రానివ్వలేదు. ఎందుకు రానివ్వరు అంటూ సిబ్బందిని నిలదీస్తే.. ‘ఇది ఇండియా కాదు, పంజాబ్’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంత జరుగుతున్నా పంజాబ్ పోలీసులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“This is Punjab not India”
Woman denied entry to the Golden temple because she had Indian flag painted on her face!
What’s this @PunjabPoliceInd ? pic.twitter.com/reKjvqTcJP
— BALA (@erbmjha) April 17, 2023