పెళ్లితో ముడిపడిన బంధం.. వివాహేతర సంబంధం కారణంగా బీటలు వారుతోంది. గతంలో భర్త, పలువురు స్త్రీలతో వెళ్లినా.. తమ కర్మ ఇంతేనని లేదా సమాజపు కట్టుబాట్ల లోబడి భర్తలను తిరిగి స్వీకరించేవారు భార్యలు.
పెళ్లితో ముడిపడిన బంధం.. వివాహేతర సంబంధం కారణంగా బీటలు వారుతోంది. గతంలో భర్త, పలువురు స్త్రీలతో వెళ్లినా.. తమ కర్మ ఇంతేనని లేదా సమాజపు కట్టుబాట్ల లోబడి భర్తలను తిరిగి స్వీకరించేవారు భార్యలు. భర్త లేకపోతే జీవితం ఉండదన్న పురాణాల్లో రాసిన రాతలను అనుసరిస్తూ.. భర్త ఏం చేసినా.. ఎంత మందితో తిరిగినా సహించేవారు. కానీ నేటి ఆధునిక పరిస్థితులు దీనికి భిన్నం. భర్త, మరో మహిళతో మాట్లాడినా భరించలేరు. అందుకే పరాయి ఇంట్లో మహిళల్ని వదిన అని పిలిచి.. భర్తకు అన్నను చేసేస్తారు. అయినప్పటికీ అక్రమ సంబంధాలకు అడ్డుకట్ట పడలేదు. ఇవే అనేక జీవితాలను నాశనం చేస్తున్నాయి.
భర్తతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న మహిళను తాట తీసింది భార్య. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి భార్య కన్ను గప్పి.. బర్న్ పూర్‌లోని ఇష్పాట్ ఇంటర్నేషన్ హోటల్ రూముకి తన ప్రియురాలితో గడిపేందుకు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య.. హోటల్‌కు వెళ్లింది. భర్త మరో స్త్రీతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అంతే సివంగిలా మహిళపై దాడి చేసింది భార్య. రోడ్డుపై ఆమెను ఇష్టమొచ్చినట్లు కొట్టింది. హెల్మెట్‌తో దాడి చేసింది. జుట్టు పట్టుకుని ఈడ్చి, కింద పడి కాలితో తన్నింది. అనంతం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి.. ఇద్దరిపై కేసు పెట్టింది.
Extra-Marital affair Kalesh after wife caught her husband with a ladypic.twitter.com/0CDfQmM1JD
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 27, 2023