వ్యసనం ఏదైనా అది మనిషిని దిగజారుస్తుంది. ఇక, మద్యానికి బానిసైన వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడ, మగ ఎవరైనా కావచ్చు.. మందుకు బానిసైతే దారుణమైన పరిణామాలు ఉంటాయి. తాజాగా, ఓ యువతి మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించింది. ఫుల్లుగా మందు తాగి, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన ఆమె పోలీసులనే ఎదురు ప్రశ్నించింది. ఆమె తీరుతో పోలీసులు కంగుతిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నైకి చెందిన మీనా అనే యువతి కొద్ది రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొంది. ఆ పార్టీలో వారితో కలిసి ఫుల్లుగా మందు తాగింది. పార్టీ అయిపోయిన తర్వాత తన స్కూటీ మీద ఇంటికి బయలు దేరింది. సైదా పేట దగ్గర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మీనా వాహనాన్ని ఆపారు.
ఆమె వాలకం చూడగానే వారికి అర్థం అయిపోయింది. ఆమె ఫుల్లుగా మందు తాగిందని గుర్తించారు. స్కూటీ తాళం చెవి లాక్కున్నారు. ఆమెను కిందకు దిగమని చెప్పారు. ఆమె కిందకు దిగింది. వారు బ్రీత్‌లైజర్‌లో ఊదమని అన్నారు. ఆమె ఊదటానికి ఒప్పుకోలేదు. పోలీసులు ఒత్తిడి తెచ్చారు. ఊదితే స్కూటీ తాళం చెవి ఇస్తామని అన్నారు. దీంతో ఆమె ఊదింది. మీటర్‌లో 183 పర్సెంటేజ్ చూపించింది. పోలీసులు ఆమె స్కూటీని పక్కకు పెట్టారు. వేరే వాహనంలో ఇంటికి వెళ్లి, ఉదయం వాహనాన్ని తీసుకొమ్మని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పోలీసులతో ఆమె గొడవ పెట్టుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఊదితే నా స్కూటీ కీస్ ఇస్తారని అన్నారు. కానీ, ఇప్పుడు మీ మాట తప్పుతున్నారు. నేను మాత్రమే క్లియర్‌గా ఉన్నా.. నేను 20కి.మీ కంటే ఎక్కువ స్పీడుగా వెళ్లను.
మీరు ఓ మహిళ మీద మీ మగతనం చూపిస్తున్నారా?. ఎవరండీ తాగనిది.. నేను ప్రతీ రోజు తాగి బండి నడుపుకుంటూ ఇంటికి వెళతాను. కానీ, మీరు ఈరోజు నన్ను ప్రశ్నిస్తున్నారు. మీరు నాకు ఫైన్ వేస్తే నేను అస్సలు కట్టను. నా దగ్గర చిల్లి గవ్వకూడా లేదు. నేనే ఫ్రీగా మందు తాగి వస్తున్నాను. నేను డబ్బు కట్టలేను. నేను నా మానాన మూలకు కూర్చుని ఏడుస్తుంటే ఇక్కడకు పిలిచారు. నన్ను జైలులో పెట్టాలనుకుంటే పెట్టండి. నాకు మీలాగా పని లేదు. నా వస్తువులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నా.. నాకు ఫైన్ వేయమని మీకు ఎవరు చెప్పారు’’ అంటూ పోలీసులపై విరుచుకుపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించిన ఈ యువతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.