కోయంబత్తూరుకు చెందిన సంగీత అనే మహిళ కొద్దిరోజుల క్రితం బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. అక్కడ ఓ యువతితో గొడవ పెట్టుకుంది. ఆ యువతిని దారుణంగా కొట్టింది.
నేటి సమాజంలో మనిషికి ఓపిక బొత్తిగా నశించింది. ప్రతీ చిన్న విషయానికి జనం సీరియస్ అయిపోతున్నారు. క్షణికావేశంలో దారుణానికి పాల్పడుతున్నారు. తాజాగా, ఓ మహిళ, ఓ యువతితో దారుణంగా ప్రవర్తించింది. బ్యూటీ పార్లర్‌లో యువతితో గొడవ పెట్టుకుని, ఆమె జుట్టు పట్టుకుని మరీ కొట్టింది. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోయంబత్తూరుకు చెందిన సంగీత అనే 40 ఏళ్ల మహిళ మే 6న పూల మార్కెట్‌లోని ఓ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది.
జుట్టుకు రంగు వేయించుకోవటానికి ఆమె పార్లర్‌కు వచ్చింది. పార్లర్‌లోని సోఫాలో కూర్చుని తన వంతుకోసం ఎదురు చూస్తూ ఉంది. అంతకంటే ముందే ఓ 23 ఏళ్ల యువతి బ్యూటీ పార్లర్‌కు వచ్చింది. సోఫాలో సంగీతకు ఎదురుగా కూర్చుని ఉంది. తాను ముందు జుట్టుకు రంగు వేయించుకుంటానని, తనను ముందు వెళ్లనివ్వాలని సంగీత ఆ యువతిని కోరింది. ఆ యువతి ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో గొడవ మొదలైంది. కొద్దిసేపటికే ఆ గొడవ కొట్టుకునే స్థాయికి వెళ్లింది.
సంగీత ఆ యువతి మీదకు వెళ్లింది. సెలూన్ సిబ్బంది, ఇతర కస్టమర్లు ఎంత వారిస్తున్నా వినకుండా యువతిపై చెయ్యి చేసుకుంది. జుట్టు పట్టుకుని మరీ చావ చితక్కొట్టింది. ప్రస్తుతం ఇందకు సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.