కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్సు కథ తన కొంప ముంచిందంటున్నాడు ఓ కర్ణాటక వాసి. బెంగళూరు బస్టాండులో ఓ వ్యక్తి తన తలను బస్సు టైరు కింద పెట్టి హల్ చల్ చేశాడు.
మనం నిత్యం ప్రయాణం చేయుటకు సౌకర్యవంతమైన రవాణా సాధనం బస్సు. ఈ బస్సు ప్రయాణంతో మన చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టేయొచ్చు. ప్రతి నిత్యం పనులు చేసుకునే వారికి బస్సు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. అలాగే పరీక్షల సమయంలో.. జాతరలప్పుడు పుణ్యక్షేత్రాలకు జనాలు వెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సులను నడుపుతారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బస్సులను ఏర్పాటు చేస్తారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాలను కల్పించింది. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఫ్రీగా వెళ్లవచ్చు. ఆ ఉచిత ప్రయాణమే తన కొంప ముంచిందంటున్నాడు ఒక కర్ణాటక వాసి. అసలు ఏమైందో పూర్తి వివరాల్లోకి వెళితే..
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లయింది.. కర్ణాటకలో లేడీస్ ఉచిత బస్సు కథ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కర్ణాటక రాష్ట్రంలో లేడీస్ కు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు. అయితే దీనిని సద్వినియోగం చేసుకునేందుకు మహిళలు పోటీ పడుతున్నారు. ఫ్రీ బస్సు కాబట్టి గుళ్లు, గోపురాలు, పుణ్యక్షేత్రాలకు వెళుతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ ఆడవారితోనే నిండిపోతున్నాయట. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్సు కథ తన కొంప ముంచిందంటున్నాడు ఓ కర్ణాటక వాసి. బెంగళూరు బస్టాండులో ఓ వ్యక్తి తన తలను బస్సు టైరు కింద పెట్టి హల్ చల్ చేశాడు. ఫ్రీ బస్సు ఎక్కి పోయిన తన భార్య ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదని ఆవేదన చెంది బస్సు టైరుకింద తలను పెట్టి హంగామా చేశాడు. ఆడవారికి ఫ్రీ బస్సులు తీసేయాలని .. వారి సంసారాలను కూల్చొద్దని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాడు. నా భార్య జాడ తెలుపకపోతే నాతల బస్సుకింద పెట్టి చనిపోతానని బెదించాడు. ఇలా బంస్టాండులో చాలాసేపు జరిగింది. ఆ వ్యక్తి ఎంతసేపటికి బస్సు కదలనివ్వకపోవడంతో బస్సులో ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇంతకు ముందు కూడా ఓ మహిళ ఫ్రీ బస్సు ఎక్కి తన పిల్లల్ని తనను వదిలి ప్రియుడితో చెక్కేసిందని ఓ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పుణ్యం కోసం పోతే పాపం చుట్టుకున్నట్లు అయింది కర్ణాటక ప్రభుత్వం తీరు. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.