మన దేశంలో ఎన్నో ఆచార, వ్యవహారాలను పాటిస్తుంటారు. అలాంటి ఓ వింత ఆచారానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక్కో దగ్గర ఒక్కో ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి పాటించే ఆచార, వ్యవహారాలు మారుతూ ఉంటాయి. ఫలానా ఆచారమే గొప్ప అంటూ ఏదీ ఉండదు. ఆ ప్రాంతంలోని ప్రజల నమ్మకాలను బట్టి అక్కడి ఆచార, వ్యవహారాలు ఉంటాయి. మన దేశంలోనైతే ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇవి ప్రజల జీవనశైలిలో ఓ భాగంగా మారాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆచారాల పట్టింపు ఎక్కువగా ఉంటుంది. ఏ శుభకార్యం మొదలుపెట్టినా తప్పకుండా ఆచారాలు పాటిస్తారు. ఇక, పెళ్లి లాంటి వేడుకులో అయితే పాటించాల్సినవి ఎన్నో ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అనే తేడాల్లేకుండా ఇద్దరి ఇళ్లలోనూ పాటించాల్సిన ఆచారాలు చాలా ఉంటాయి.
పెళ్లయ్యాక కూడా కొన్ని పద్ధతులను ఫాలో కావాల్సి ఉంటుంది. అలాంటి ఓ ఆచారానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక భార్య తన భర్త కాళ్లను నీళ్లతో శుభ్రం చేసి.. తిరిగి అదే నీటిని తాగడాన్ని చూడొచ్చు. ఆ తర్వాత భర్త కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడాన్ని కూడా అందులో చూడొచ్చు. ఈ ఆచారాలు మన దేశంలోనే జరిగినట్లుగా కనిపిస్తున్నా.. సరిగ్గా ఏ రాష్ట్రంలో జరిగిందనేది తెలియరాలేదు. కానీ ఈ వింత ఆచారానికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మరి.. భర్త కాళ్లు కడిగి, ఆ నీళ్లను భార్య తాగే ఈ ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hindu wives washing the feet of husband and then drinking that water
Shiva Purana Rudra samhita parvati khanda 54/25 “. If a woman wants holy water she shall drink the same with which her husband’s feet have been washed. All holy rivers are present in that water” pic.twitter.com/MSFLtek8VC
— naman (@naman_ltt) March 20, 2023
Women continue to be treated inhumanely despite India’s rise to superpower status.
How come these men can’t stop them?pic.twitter.com/vmSYYEBInT
— Shirin Khan (@Shirinkhan0) March 20, 2023