రోడ్లపై భద్రతా నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా.. కొంత మందికి చెవికెక్కడం లేదు. రోడ్లపైనే పిచ్చి, వికృత చేష్టలు చేస్తున్నారు. రీల్స్ పేరుతో డ్యాన్స్ లు, ఫీట్లు చేస్తున్నారు. ఇది ఒక్కొక్కసారి ఇతరులనకే కాదూ వారికి ఇబ్బందులను తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గ్రహించడం లేదు.
ఇటీవల రోడ్ల మీద కొంత మంది తమకు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. రోడ్లపై రాష్ డ్రైవింగ్‌తో పాటు డ్యాన్సులు, ఫీట్లు వంటివి చేస్తున్నారు. పోనీ అంతటితో ఆగితే సరిపోతుంది. కానీ మరో మనిషిని ఇబ్బందికి గురి చేసేలా కొన్నిపనులు చేస్తున్నారు. పార్కుల్లో చేయాల్సిన పనులను పబ్లిక్‌గా చేస్తున్నారు. బైక్‌పై యువతిని ముందు భాగంలో ఎక్కించుకుని వెళ్లడం, ముద్దులు పెట్టడం, కౌగిలించుకోవడం వంటి జుగుప్పాకరమైన చేష్టలు చేస్తున్నారు. కేవలం బైకర్లే కాదూ కారులోనూ ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. తోటి ప్రయాణీకులు వీటిని వీడియోలు తీసి నెట్టింట్లో షేర్ చేస్తుండటంతో వైరల్‌గా మారుతున్నాయి. ఇటువంటి చర్యలు ఆనందమనిపించవచ్చునేమో కానీ, కొన్ని సార్లు ప్రాణం మీదకు వస్తాయి. ఇటువంటి ఘటనలు పోలీసులు సైతం తప్పుపడుతున్నారు. హెచ్చరిస్తున్నారు.
అయినా తమకు పట్టనట్లు వ్యవహరించిందో జంట. కారులో వెళుతున్న ఓ జంట.. రోడ్డుపై ఉన్నామన్న సంగతి మర్చిపోయినట్లున్నారు. రొమాన్స్ లాంటి గిల్లికజ్జాలకు దిగారు. రోడ్డు భద్రతా నిబంధనలు గాలి కొదిలేసి.. భార్యతో సరసల్లాపాల్లో మునిగి తేలాడు భర్త. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అందులో అతడు డ్రైవింగ్ పూర్తిగా మాసేసి.. తన భార్యతో కలిసి ఆడుతున్నాడు. అంతేనా సెల్ ఫోన్ చూసుకుంటూ కాసేపు.. కాళ్లు సీట్ల మీద పెట్టి హాయిగా రెస్ట్ తీసుకున్నాడు. అంత సేపు కూడా కారు పోతూనే ఉంది. కానీ అతను మాత్రం డ్రైవింగ్ చేయలేదు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో విషయం పోలీసుల వద్దకు చేరింది.
అయితే పోలీసులు అతడ్ని విచారించగా.. రీల్ కోసం చేసినట్లు చెప్పాడు. రెండు వారాల క్రితం కోటా నుండి టోంక్‌కి వెళ్తున్నప్పుడు అతడు కారును అసిస్టెంట్ సిస్టమ్‌లో అంటే ఆటో మోడ్‌లోకి మార్చి హాకీ రీల్‌ను చేసినట్టుగా చెప్పాడు. కాగా, తన భార్య నజ్మా బానోతో కలిసి టోంక్‌లోని నివాయ్‌లోని తన సోదరి ఇంటికి వెళుతుండగా చేసినట్లు చెప్పాడు. తన భార్య కోరిందని ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు. రోడ్డు ఖాళీగా ఉండటంతో అలా చేశానని, మరోసారి ఇటువంటివి చేయనని క్షమాపణ వేడుకున్నాడు. పోలీసులు సైతం అతడ్ని హెచ్చరించి పంపించేశారు. ఈసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఇకపై ఎవరూ చేసిన మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు.
हाईवे पर तेज रफ्तार कार को ऑटो मोड में डालकर युवक ने अपनी पत्नी के साथ रोमांस करते हुए मौज मस्ती की रील सोशल मीडिया पर की अपलोड, सोशल मीडिया पर वाहवाही लूटने वाला युवक पहुंचा पुलिस थाने हाथ जोड़कर मांगी माफी @ABPNews@ashokgehlot51 #Modi@BJP4India @nitin_gadkari @prempratap04 pic.twitter.com/LHH2BX5hqU
— करनपुरी (@abp_karan) March 15, 2023