చిన్నప్పుడు ప్రతి ఒక్కరు పలు ప్రశ్నలతో అమ్మ నాన్నలను వేధించిన వారే. ప్రశ్నలు కొన్ని సార్లు ఫన్నీగా అనిపించవచ్చు కానీ, కొన్సి సార్లు ఆలోచింప చేస్తాయి. ఆ ప్రశ్నలు చిన్నవే అయినప్పటికీ.. పెద్దల దగ్గర కూడా సమాధానం ఉండరు. ఎందుకంటే వారికి ఆ ప్రశ్న మొదులుతూనే ఉంటుంది. అటువంటి ప్రశ్నల్లో ఈ ప్రశ్న కచ్చితంగా ఉంటుంది.
మనిషి మెదడు ప్రశ్నల పుట్ట. .చిన్న నాటి నుండి కాటికి కాలు చాపే సమయం వరకు కూడా పలు ప్రశ్నలు మనల్ని వేధిస్తుంటాయి. అమ్మ, నాన్నలను ఏదో ఒక ప్రశ్నలు వేస్తూనే ఉంటారు చిన్న పిల్లలు. ఆ వయసు నుండే ఎన్నో ప్రశ్నలు మస్తిష్కాన్ని తొలిచేస్తుంటాయి. ఆకాశం నీలంగానే ఎందుకు ఉంటుంది. చందమామలో కుందేలు ఉంటుందా? పాలు ఎందుకు తెల్లగా ఉంటాయి. ఇవన్నీ ప్రశ్నలే. అవి పెద్దవే కానవసరం లేదు. కొన్ని సార్లు సమాధానాలు దొరుకుతాయి కానీ.. కొన్ని సార్లు ప్రశ్నార్థకాలుగానే మిగిలిపోతాయి. ఆ ప్రశ్నల్లో కొన్ని పెద్దయ్యాక కూడా వెంటాడుతుంటాయి. అటువంటి ప్రశ్నల్లో ఇది కచ్చితంగా ఉంటుంది. మనం రైళ్లు, బస్సులో ప్రయాణించే ప్రతిసారి మనకు ఎదురయ్యే ప్రశ్న. మనం కూర్చున్న సీట్లు బ్లూ కలర్‌లోనే ఎందుకు ఉంటాయని, ఈ ప్రశ్న అనేక మందిని తొలిచేస్తుంటుంది. అయితే దీనికి కారణం తెలిసింది.
ఊరెళ్లాలంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది రైలు. సౌైకర్యవంతమైన ప్రయాణం. రైలు ఎక్కగానే వెతుకున్నేదీ సీటు కోసం. సీటు దొరికితే అందులోనూ కిటీకీ పక్క సీటు దొరికితే.. అబ్బా ఆ హాయే వేరు. అయితే రైలు ఎక్కిన ప్రతిసారి మనకు కనిపించేవీ బ్లూ రంగులో ఉంటే సీట్లే. ఎప్పటి నుండో ఈ కలర్‌లోనే సీట్లు ఉంటాయి. ఈ కలర్‌లో ఉండడానికి సైంటిఫికల్‌గా ఓ కారణం ఉంది. సైంటిస్టుల ప్రకారం ఒక్కో రంగుకు ఒక్కో విధమైన రియాక్ట్ ఉంటుంది. ఎర్ర రంగు చూస్తే భయోత్పాతాన్ని, రెవల్యూషన్ కలిగిస్తున్నట్లే.. నీలి రంగుకు కూడా కొన్ని గుణాలున్నాయి. నీలి రంగు రక్షణతో పాటు మనస్సును హాయిగొల్పే లక్షణాలుంటాయని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. అందుకే రైలు, బస్సుల్లో సీట్లు బ్లూ కలర్ లోనే ఏర్పాటు చేస్తారు.
బస్సుకు కూడా ఇదే సైంటిఫిక్ రీజన్ వర్తిస్తుంది. ప్రయాణం అంటే కచ్చితంగా టెన్షన్ ఉంటుంది. వారం ముందు నుండే మనల్ని ఓ రకమైన టెన్షన్‌లో పడేస్తుంది. ఇక ప్రయాణించే రోజు వస్తే ట్రైన్, బస్సు మిస్ అవుతామనే కంగారులో మనం ఉంటాం. దీంతో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ప్రయాణం సజావుగా సాగదు. ప్రయాణం హాయిగా సాగేందుకే నీలి రంగు సీట్లను తయారు చేసి.. ఏర్పాటు చేస్తారు. నీలి రంగు హాయికి, ఆహ్లాదానికి చిహ్నంగా ఉంటుదన్న లాజిక్‌ను జపాన్ నగరం నమ్మి ఓ ప్రయోగం కూడా చేసిందట. టోక్యో నగరంలో వీధి దీపాలను బ్లూ రంగులోకి మార్చారు. దీంతో అక్కడ నేరాలు కూడా అదుపులోకి వచ్చాయి. నీలిరంగు దీపాలు చూస్తే కోపం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మనుషులపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయని శాస్త్రజ్ఞులు అంటున్నారు.