జనతా దళ్ యూనైటడ్ పార్టీ అధినేత నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను ఆర్జేడీ పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. తనకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ కు లేఖ కూడా సమర్పించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చిన నితీష్ కుమార్ మళ్ళీ సీఎం అవుతారా? సీఎం అవ్వాలంటే ఆయనకి ఎన్ని సీట్లు కావాలి? బీజేపీ అభ్యర్థి సీఎం అవ్వాలంటే ఎన్ని సీట్లు కావాలి? బీజేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? బీహార్ అసెంబ్లీలో ఏ పార్టీ స్థానం ఎంత? ఇఇ నంబర్ గేమ్ లో నితీష్ కుమార్ ఎలా సీఎం అవుతారు? ఆయన అంత కాన్ఫిడెంట్ గా రాజీనామా ఎలా చేయగలిగారు?
గతంలో బీజేపీ-జేడీయూ కూటమితో 243 అసెంబ్లీ స్థానాలకి 122 స్థానాలను దక్కించుకున్నాయి. ఇతర జూనియర్ పార్టీలతో కలిసి 125 స్థానాలను గెలుచుకున్నాయి. ఆ సమయంలో జేడీయూ పార్టీకి 43 స్థానాలు, బీజేపీకి 74 స్థానాలు ఉన్నాయి. అయినప్పటికీ నితీష్ కుమార్ కి బీజేపీ మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ స్థానాలు 242 కాగా.. సాధారణ బలం నిరూపించుకోవడానికి 121 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. ఇప్పటివరకూ బీజేపీ మరియు ఇతర పార్టీల మద్దతుతో ఈ మెజారిటీ దక్కించుకున్నారు. అయితే బీజేపీతో తెగదెంపులు చేసుకున్న ఆయన ప్రస్తుతం 77 ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయారు.
అయితే గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి తర్వాత 79 సీట్లతో అతి పెద్ద పార్టీగా రాష్ట్ర జనతా దళ్ పార్టీ నిలిచింది. ఇది బీజేపీ కంటే 5 సీట్లు ఎక్కువ. కాంగ్రెస్ కు 19 , సీపీఎంఎల్ కు 12, సీపీఐ 2, సీపీఐఎం 2, ఎంఐఎంకు 1 మొత్తం 36 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం నితీష్ కుమార్ కు ఏడు పార్టీలు, ఒక ఇండిపెండెంట్ మద్దతు ఉంది. తనకు 164 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని, బీహార్ లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.
బీహార్ హౌస్ లో 243 స్థానాలకు ఆర్జేడీ ఎమ్మెల్యే మరణం కారణంగా 242 స్థానాలు మాత్రమే ఉన్నాయి. 242 స్థానాల్లో ప్రస్తుతం ఆర్జేడీకి 79, బీజేపీకి 77, జేడీయూకి 45, కాంగ్రెస్‌కు 19 సీట్లు, వామపక్షాలకు 16 సీట్లు, హిందుస్థానీ అవామ్ మోర్చా -సెక్యులర్ పార్టీకి 4, ఎంఐఎం పార్టీకి ఒకటి, లోక్ జనశక్తి పార్టీకి ఒకటి ఉన్నాయి. ఈ లెక్కన ప్రతిపక్షంలో ఉన్న మహాకూటమికి(నితీష్ కుమార్ కి) 115 సీట్లు ఉన్నట్టు. ఆయనకు ఇంకా 6 సీట్లు కావలి. ఇక అధికార ఎన్డీఏ కూటమికి 127 సీట్లు ఉండాల్సి ఉండగా.. ఇందులో బీజేపీవి 77 స్థానాలు మాత్రమే.
అయితే బీజేపీ జేడీయూ పార్టీకి మద్దతు ఇస్తామని హామీకి ఇచ్చింది. జేడీయూ సీట్లు 43 ఉన్నాయి కాబట్టి బీజేపీ, జేడీయూ కూటమికి 120 స్థానాలు దక్కుతాయి. మరి జేడీయూ పార్టీ బీజేపీతో పొత్తుకు ఓకే అంటుందా? లేదా? మరోవైపు ప్రతిపక్ష కూటమికి 115 సీట్లు ఉన్నాయి. ఇంకా 6 సీట్లు మద్దతు కావాలి. మరి ఈ పొలిటికల్ నంబర్ గేమ్ లో బీహార్ లో ఎవరు చక్రం తిప్పుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.