అతీఖ్ అహ్మద్ మృతి చెంది నాలుగైదు రోజులు అవుతోంది. నేటికి కూడా అతడికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా అతీఖ్ అహ్మద్‌కు సంబంధించిన ఆస్తుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి అవి ఎవరికి చెందుతాయి అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వివరాలు..
ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్‌పై ముగ్గురు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో హతమైన సంగతి తెలిసిందే. మీడియా ముసుగులో వచ్చిన దుండగులు.. అతీఖ్ మీద.. అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతీఖ్ మీద కాల్పులు జరిపిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేమస్ అవ్వడం కోసమే తాము అతీఖ్ మీద కాల్పులు జరిపామని తెలిపారు. ఈ ఘటనపై పలు విపక్ష పార్టీలు.. విమర్శలు చేస్తున్నాయి. ఇలా ఉండగా.. అతీఖ్ హతమైన తర్వాత అతడి నేర సామ్రాజ్యానికి సంబంధించిన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా అతీఖ్ ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. అవి ఎవరికి చెందుతాయి అనే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
గతంలో ఈడీ అతీఖ్‌కు సంబంధించి 1400 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. అతడికి సంబంధించిన 50 షెల్ కంపెనీలను గుర్తించింది. నల్ల ధనాన్ని వైట్‌గా మార్చడం కోసం అతీఖ్ ఈ కంపెనీలను సృష్టించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా.. పలు రాష్ట్రాల్లో అతిక్ అహ్మద్‌కు భారీగా ఆస్తులు ఉన్నాయని పోలీసులు కూడా గుర్తించారు. ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌లు, కార్యాలయాలు, నివాస స్థలాలు, వాణిజ్య సముదాయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటి విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవే కాకుండా అతీఖ్‌కు యూపీలో చాలా చోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి అయ్యాక.. చాలాచోట్ల అతిక్ ఆస్తులను ధ్వంసం చేశారు. కానీ.. ఇతర రాష్ట్రాల్లో అతీఖ్‌కు ఉన్న ఆస్తులు అలాగే ఉన్నాయి. అతీఖ్ మృతి చెందిన నేపథ్యంలో.. ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయనే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. అతిక్ అహ్మద్, అతని సోదరుడు ఇద్దరూ చనిపోయారు. అతని కొడుకుల్లో పెద్ద కుమారుడు జైలులో ఉండగా.. రెండో కుమారుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. మరో ఇద్దరు మైనర్లు కావడంతో.. జువైనల్ హోమ్‌లో ఉన్నారు.
అటు అతీఖ్ భార్య షైస్తా పర్వీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అలానే అతీఖ్‌తో పాటు మృతి చెందిన అతడి సోదరుడి భార్య కూడా పరారీలోనే ఉంది. అతీఖ్ సోదరి నూరీ అజ్ఞాతంలో ఉంది. అతని బావ అఖ్లాక్ జైలులో ఉన్నాడే. ఇటు అతీఖ్ దగ్గరి బంధువులు కూడా ఎవరూ బయటకు రావడం లేదు. పైగా అతీఖ్‌కు సంబంధించిన ఆస్తులన్ని అక్రమంగా సంపాదించినవే. ఇప్పుడు వాటి కోసం బయటికొస్తే.. కేసులు తప్పవని అతని బంధువులు భయపడుతున్నారని సమాచారం. దాంతో అతీఖ్ ఆస్తులు ఎవరికి చెందుతాయనే దాని మీద యూపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరేమే ప్రభుత్వమే ఈ ఆస్తులను స్వాధీనం చేసుకుంటుందని భావిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.