ఈ ఏడాది కూడా ఫెమినా మిస్ ఇండియా పోటీలు అట్టహాసంగా జరిగాయి. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. మొత్తం 29 రాష్ట్రాలకు చెందిన అందాల భామలు మిస్ ఇండియా కిరీటం కోసం పోటీ పడ్డారు. ఇంతకు ఈ ఏడాది భారత అందగత్తె ఎవరంటే..?
ఏడాదికొసారి దేశానికి అందగత్తె ఎవరన్న పోటీలు జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా ఫెమినా మిస్ ఇండియా పోటీలు జరిగాయి. ఇప్పటి వరకు 58 ఎడిషన్లు జరగ్గా.. తాజాగా 59వ ఎడిషన్ జరిగింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ఈ వేడుకలు జరిగాయి. మొత్తం 29 రాష్ట్రాలకు చెందిన అందాల భామలు మిస్ ఇండియా కిరీటం కోసం పోటీ పడ్డారు. ఈ వేడుకలకు సినీ తారలతో పాటు పలు రంగానికి చెందిన ప్రముఖులు హజరయ్యారు. నటులు కార్తీక్ ఆర్యన్, అనన్య పాండేల స్టేజీపై ఆట, పాటలతో హొరెత్తించారు. అనంతరం విన్నర్‌ను ప్రకటించారు. తన అందం, అభియనంతో ఆకట్టుకున్న ఆ చిన్నదీ ఎవరంటే..?
రాజస్థాన్‌కు చెందిన 19ఏళ్ల భామ నందినీ గుప్తా ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. అన్ని పోటీల్లోనూ ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా, మణిపూర్‌కు చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. గత ఏడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీ సదానంద శెట్టి, నందినీ గుప్తాకు కిరీటాన్ని తొడిగారు. తెలంగాణ నుండి ఊర్మిళ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ నుండి గోమతి ఈ పోటీల్లో నిలిచారు. గతేడాది విజేతలు సినీ శెట్టి, రూబల్ షెకావత్, షినతా చౌహాన్, మానస వారణాసి, మాణికా షియోకంద్, మాన్య సింగ్, సుమన్ రావ్, శివాని జాదవ్ మోహే లెహంగాలు ధరించి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.