సాంకేతికత వచ్చాక లైఫ్ చాలా షార్ట్ అండ్ స్పీడ్ అయిపోయింది. ఒకప్పుడు టికెట్లు బుక్ చేసుకోవాలంటే క్యూ లైన్లో గంటలు గంటలు నిలబడాల్సి వచ్చేది. చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చాక క్షణాల్లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అవి సినిమా టికెట్లు కానియ్యండి, రైలు టికెట్లు, బస్సు టికెట్లు, విమాన టికెట్లు ఏవైనా కానియ్యండి. అయితే వాట్సాప్ అనేది అందరికీ కామన్ యాప్ అయిపోయింది. ఎంత పెద్ద యాప్స్ ఉన్నా గానీ పర్సన్ టూ పర్సన్ కాంటాక్ట్ అవ్వడానికి వాట్సాప్ ప్రధానమైపోయింది. అందుకే ఈ వాట్సాప్ లోకే మెట్రో సేవలను ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా అందుబాటులోకి తీసుకురావాలని మెట్రో రైలు భావించింది. టికెట్లను డైరెక్ట్ గా వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అంతేనా ఇంకా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో సిటీల్లో వాట్సాప్ బిజినెస్ ప్లాట్ ఫార్మ్ లో మెట్రో రైలు రవాణా పరిష్కారాన్ని చూపేందుకు వాట్సాప్ సంస్థ మెట్రో రైలు సర్వీస్ ప్రొవైడర్లతో చేతులు కలిపింది. ఇక నుంచి మెట్రో ట్రైన్ టికెట్లు వాట్సాప్ చాట్ బాట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, టికెట్ బుక్ చేసుకోవడం, తక్షణమే టికెట్ కొనుగోలు చేయడం, టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం, టికెట్ వాలెట్ రీఛార్జ్ చేసుకోవడం వంటి అనేక ప్రయోజనాలు ఇక నుంచి వాట్సాప్ ద్వారా పొందవచ్చు. వీటితో పాటు మెట్రో రైలు ప్రయాణ సమయాలు, ప్రయాణ మార్గం, ఫేర్ బ్రేకప్ సహా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. దీని గురించి వాట్సాప్ బిజినెస్ మెసేజింగ్ డైరెక్టర్ రవి గార్గ్ మాట్లాడుతూ.. భారత్ యొక్క డిజిటల్ విప్లవం ప్రజా రవాణాను సురక్షితంగా, స్మార్ట్ గా, మరింత అనుకూలంగా, సౌకర్యంగా ఉంచుతుంది. నిత్యం మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు అనుకూలంగా వాట్సాప్ లో ఇండియా వరల్డ్ క్లాస్ మెట్రో సేవలు అందించేందుకు వాట్సాప్ తో చేతులు కలపడం గర్వంగా ఉందని రవి గార్గ్ అన్నారు.
రైలు రవాణాను ఇతర నగరాల్లో కూడా డిజిటైజ్ చేయడం పట్ల సంతోషంగా ఉన్నామని, దేశవ్యాప్తంగా ప్రతి రోజూ ప్రయాణించే ప్రయాణికులకు వాట్సాప్ లో అందుబాటులో ఉండే ఈ డిజిటైజ్ ట్రైన్ ట్రాన్సిట్ సర్వీసులు మరింత అనుకూలంగా ఉంటాయని అన్నారు. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూణె నగరాల్లో నివసించే వారికి ఈ డిజిటైజ్డ్ మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీని కోసం వాట్సాప్ సంస్థ.. బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్, ముంబై మెట్రో, పూణే మెట్రో, ఎల్&టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థలతో భాగస్వామ్యం అయ్యిందని తెలిపారు.
బెంగళూరులో ఉన్న ప్రయాణికులు వాట్సాప్ లో ఇంగ్లీష్ లేదా కన్నడ భాషలో చాట్ చేయడం ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలానే టికెట్ ధరలు తెలుసుకోవచ్చు, కార్డులను క్యూఆర్ టికెటింగ్ సర్వీస్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు, కార్డు సమాచారం చూసుకోవచ్చు. బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పూణే నగరాల్లో ఉన్న వారు వాట్సాప్ లో మెట్రో సేవలను పొందాలంటే https://wa.me/+918105556677 నంబర్ కి Hi అని మెసేజ్ సెండ్ చేయాలి. మరి వాట్సాప్ ద్వారా మెట్రో రైలు సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.