ఎన్నో ఆశలతో ఆ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. పెళ్లై నెల రోజులే అవుతోంది. ఈ క్రమంలో ఓ రోజు ఉదయం లేచి చూసే సరికి భార్య కనిపించలేదు. దాంతో పోలీసులను ఆశ్రయించాడు. భార్య కోసం గాలిస్తుండగా.. ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. ఆ వివరాలు..
సాధారణంగా ప్రేమ, పెళ్లిళ్లు వంటివి ఆడా, మగ మధ్య జరిగే తంతు. ప్రకృతి ధర్మం కూడా అదే. కానీ ఈమధ్య కాలంలో ప్రకృతి, సృష్టి ధర్మానికి విరుద్ధంగా వికృత రీతిలో.. ఒకే వర్గానికి చెందిన వారు అనగా మగాళ్లు మగాళ్ల మీద, ఆడాళ్లు మహిళల మీద మనసు పడుతున్నారు. ఓ పాతికేళ్ల క్రితం వరకు ఇలాంటి సంఘటనల గురించి బయటకు వెల్లడించాలంటే భయపడేవారు. అయితే నేటి కాలంలో సమాజంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కోర్టులు, ప్రభుత్వాలు కూడా వీరికి అండగా నిలుస్తున్నాయి. ఈ తరహా బంధాలకు ఆమోదం కూడా తెలుపుతున్నాయి. ఫలితంగా ఈ రోజుల్లో సేమ్ సెక్స్ వివాహాలు, ప్రేమలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు ఆ యువకుడు. కానీ పెళ్లైన నెల రోజులకే భార్య ఇచ్చిన షాక్ చూసి బిక్క చచ్చిపోయాడు. వెంటనే లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకు ఏమైంది అంటే నవ వధువు భర్తను వదిలేసి.. తాను ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్లింది. మీరు చదివింది నిజమే.. లవ్ చేసిన అమ్మాయి కోసం వివాహిత భర్తను వదిలేసి వెళ్లింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. ఆలిపుర్ద్వార్ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన ఓ యువతి, కుచ్‌బిహార్ జిల్లాకు చెందిన తుఫాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన మరో అమ్మాయి కాలేజీ చదువుతున్నారు. రెండేళ్ల క్రితం ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది.
అయితే వీరి వ్యవహారం ఇద్దరు యువతుల ఇళ్లల్లో తెలిసింది. దాంతో పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు.. తుఫాన్‌గంజ్ అమ్మాయికి పెళ్లి కుదిర్చారు. తమ ప్రాంతానికే చెందని ఓ యువకుడితో హడావుడిగా వివాహం చేశారు. తర్వాత కుమార్తెను అత్తారింటికి పంపారు. పెళ్లి అయిన తర్వాత కుమార్తె మారుతుందని భావించారు. కానీ ఆమె తన ప్రేమను మర్చిపోలేకపోయింది. దాంతో వివాహమైన నెల రోజుల తర్వాత.. భర్తను వదిలి.. తన ప్రియురాలి దగ్గరకు వెళ్లింది సదరు యువతి. ఆతర్వాత ఇద్దరు కలిసి మల్దా ప్రాంతంలోని ఓ హోటల్‌లో రూమ్ రెంట్‌కి తీసుకుని.. అక్కడే ఉంటున్నారు. అయితే వారి ప్రవర్తన మీద అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది.. ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. దాంతో హోటల్ సిబ్బంది వెంటనే వారిని పోలీసుల వద్దకు తీసుకెళ్లారు.
అప్పటికే యువతులు కుటుంబ సభ్యులు, తుఫాన్‌గంజ్ మహిళ భర్త కూడా వీరు కనిపించడం లేదని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. మల్దా పోలీసులు యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి.. ఇంటికి పంపాలని భావించారు. కానీ యువతులు మాత్రం అందుకు అంగీకరించలేదు. వివాహిత మహిళ.. తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారని.. భర్తతో కలిసి ఉండటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిపింది. అంతేకాక ప్రియురాలితో కలిసి.. భార్యాభర్తల మాదిరే జీవించాలని కోరుకుంటున్నాము అన్నది. తల్లిదండ్రులు తమ బంధానికి ఆమోదం తెలిపితేనే ఇంటికి వెళ్తామని.. లేదంటే.. తమ బతుకు తాము బతుకుతాం అని స్పష్టం చేసింది. యువతులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని.. వారు రాగానే యువతులును వారికి అప్పగిస్తామని మల్దా పోలీసులు తెలిపారు. మరి మన సమాజంలో ఈ తరహా వివాహాలకు పెరగాడానికి కారణం ఏంటి.. సమాజం వీటిని అంగీకరిస్తుందా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.