West Bengal Farmer Son Bags Huge Package At Facebook London: మన దేశంలో ఆరుగాలం శ్రమించి కూడా అప్పుల పాలయ్యేది రైతు మాత్రమే. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మూడు పూటలా పట్టెడన్నం లభించదంటే.. ఎంతటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నాడో అర్థం అవుతుంది. తాను ఇంత కష్టపడ్డ ఫలితం రావడం లేదు కాబట్టే.. తన బిడ్డను అన్నదాతగా మార్చడానికి ఏ రైతు ఇష్టపడటం లేదు. తాను తిన్నా తినకపోయినా.. నిత్యం శ్రమిస్తూ.. రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డలు భవిష్యత్తు కోసం కష్టపడతాడు. తనలాగే తన బిడ్డలు ఇబ్బంది పడకూడదని భావిస్తాడు. అందుకోసం ఎన్ని అప్పులు చేయడానికి అయినా సిద్ధపడతాడు. అయితే అందరూ బిడ్డలు తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుంటారా అంటే లేదు. కొందరు మాత్రమే తల్లిదండ్రలు శ్రమను గుర్తించి.. అందుకు తగ్గట్లు కష్టపడి చదువుకుని జీవితంలో రాణిస్తారు. ఇందుకు ఉదాహారణగా నిలుస్తున్నాడు ఇప్పుడు మీరు చదవబోయే యువకుడు. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని.. కష్టపడి చదివాడు. అతడి కష్టం వృథా పోలేదు. ఫేస్‌బుక్ లాంటి అంతర్జాతీయ సంస్థలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. తమ బిడ్డ ప్రతిభ చూసి ఆ తల్లిదండ్రులు మురిసిసోతున్నారు. ఆ వివరాలు..
కోల్‌కతా జాదవ్‌పూర్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఫైనలియర్ చదువుతున్న బిశాక్ మోండాల్‌కు.. హయ్యెస్ట్‌పే ప్యాకేజీతో జాబ్ దక్కింది. అతనిది ఒక సాదాసీదా రైతు కుటుంబం. బీర్‌భూమ్‌లోని రామ్‌పూర్‌హట్‌లో ఉంటోంది అతని కుటుంబం. తండ్రి రైతుకాగా.. తల్లి అంగన్‌వాడీ వర్కర్. తమ బిడ్డను తమను గర్వపడేలా చేశాడని ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Mother: భర్తను భయపెట్టడానికి 2 నెలల బిడ్డపై ప్రతాపం.. హింసిస్తూ వీడియో..
బిశాఖ్ సెప్టెంబర్‌లో లండన్‌లోని ఫేస్‌బుక్‌లో జాయిన్ కాబోతున్నాడు. కోటి 80 లక్షల రూపాయల ప్యాకేజ్. అయితే ఫేస్‌బుక్ కంటే ముందు అతనికి గూగుల్, అమెజాన్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. ప్యాకేజీ ఎక్కువగా ఉండడంతో ఫేస్‌బుక్ వైపు మొగ్గు చూపించినట్లు తెలిపాడు. గతంలో కోటి కంటే ఎక్కువ జీతంతో తొమ్మిది మంది జేయూ విద్యార్థులు ఈ ఘనత సాధించగా.. ఆ అందరిలోకెల్లా హయ్యెస్ట్ ప్యాకేజీ దక్కించుకుంది మాత్రం బిశాఖ్ కావడం గమనార్హం. మరి రైతు బిడ్డ సాధించిన ఈ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Anand Mahindra: మీ క్వాలిఫికేషన్ ఏంటన్న నెటిజన్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా కౌంటర్!